50 ఏండ్లలోపు గుండెపోటు.. అకస్మాత్తుగా మరణాలు..ఎందుకు..?

MOHAN BABU
 చాలామంది  ఫిట్ గా ఉండాలని  ప్రతిరోజు అనేక రకాల వ్యాయామాలు, జిమ్ సెంటర్ లోకి వెళ్లి కసరత్తులు చేస్తూ ఉంటారు. కొంతమంది ప్రోటీన్ ఫుడ్ తింటూ తన బాడీ ని పెంచుకుంటూ పోతారు. వాళ్లు ఎన్ని  ఆరోగ్య చిట్కాలు పాటించినా గుండెపోటు మాత్రం ఎవరినీ వదలడం లేదు. ఈ గుండెపోటుతో చాలా మంది మరణిస్తున్నారు. మనం ఫిట్గానే ఉన్నట్టు  అనుకుంటాం. కానీ ఆరోగ్యంగా ఉన్నట్టు కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. బయటకి ఎంత బలంగా కనిపించిన లోపల ఎన్నో అనారోగ్య సమస్యలు కనిపించకుండా ఉంటాయని, అందుకే మనకు ఎక్కువగా గుండె జబ్బులు వస్తున్నాయని చెబుతున్నారు. అసలు  గుండె జబ్బులు ఎందుకు వస్తాయి.. ఎవరికి ఎక్కువగా వస్తుంది. తెలుసుకుందాం..?

ప్రస్తుత కాలంలో  ప్రతి ఒక్కరూ వారి ఉద్యోగ రీత్యా చాలా బిజీగా ఉంటున్నారు. వారికి తెలియకుండానే ఎంతో ఒత్తిడికి, మానసిక ఆందోళన గురవుతూ ఉంటారు. వీరిలో ఎక్కువగా గుండె పోటు వచ్చే అవకాశం ఉందని  తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. ఈ గుండె పోటు ద్వారా మరణించే వారి సంఖ్య 50 సంవత్సరాల లోపు వారిలోనే ఎక్కువగా ఉన్నదని నిపుణులు తెలుపుతున్నారు. అయితే  మనకు ఏమైనా అనారోగ్య సంకేతాలు వచ్చినప్పుడు వాటిని నిర్లక్ష్యం చేయరాదని వారు సూచిస్తున్నారు.

 ప్రతి ఒక్కరూ ఏడాది లేదా ఆరు నెలలకు ఒకసారి హెల్త్ చెకప్ అనేది చేయించుకోవడం వలన మన ఆయుష్షు పెంచుకోవడానికి వీలుంటుందని అంటున్నారు. ఒకప్పుడు 50 సంవత్సరాలు దాటి ఉన్నవారిలో హార్ట్ఎటాక్ వ్యాధి వచ్చేది అని, కానీ ప్రస్తుత కాలంలో 25 సంవత్సరాల నుంచి 40 ఏళ్ల లోపే  గుండెపోటు అధిక వస్తుందని, మీరు పైకి ఆరోగ్యంగా కనిపించినా లోపల అనేక ఆనారోగ్య సమస్యలు, ఒత్తిడి, నిద్రలేమి వల్ల వారికి నిద్ర లోనే గుండె ఆగిపోతుంది అని  డాక్టర్లు అంటున్నారు. ఈ గుండె జబ్బుల నుంచి ఉపశమనం పొందాలంటే తాజా కూరగాయలు, పండ్ల రసాలు, ఫ్యాట్ లేని ఆహార పదార్థాలు తీసుకోవాలని డాక్టర్లు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: