కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపే అలవాటుందా..! అయితే ప్రమాదమే..?

MOHAN BABU
 ఒక్కొక్కరికి  ఒక అలవాటు ఉంటుంది. అలవాటు అనేది వారికి తెలియకుండానే దాని పని అది చేసుకుంటూ పోతోంది. ఇలా కొందరికి చేతులు ఊపే అలవాటు, మరి కొందరికి తల ఊపే అలవాటు, కొందరికి  కండ్లు కొట్టుకునే అలవాటు, కొందరికి కాళ్లు ఊపే అలవాటు ఉంటుంది. ఈ అలవాట్లు  వారి ప్రమేయం లేకుండానే  వాటికవే జరిగిపోతూవుంటాయి. అది ప్రస్తుత బిజీ లైఫ్ లో  వీటిపై ఎక్కువగా  దృష్టిపెట్టరు. కాబట్టి అవి తీవ్రమై వివిధ ఆరోగ్య సమస్యలకు దారి కూడా తీస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొంతమంది అలవాట్లు  తమకు హాని చేస్తాయని తెలిసినా  మానుకోలేరు.  ఇందులో  కాళ్లు ఊపే అలవాటు ఎక్కువ మందికి ఉంటుంది. ఎక్కువగా మనం  పుస్తకాలు చదువుతున్నప్పుడు, ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, మొబైల్ ను వాడుతున్నప్పుడు కాళ్ళు ఉపాడం జరుగుతుంది.

అయితే మనం కూర్చుని ఉన్నప్పుడు కాలు ఊపడం  అనేది మంచిది కాదని డాక్టర్లు చెబుతున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే విషయమని వారంటున్నారు. అయితే ఈ కాళ్ళు ఊపడానికి కొన్ని కారణాలు ఉంటాయని  వారు తెలుపుతున్నారు. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని ఒత్తిడి, ఆందోళన  మనం కాళ్లు ఊపడానికి కారణమవుతాయని అంటున్నారు.

దీంతో పాటుగా సరిగా నిద్రపోవకపోవడం, హార్మోన్ల ప్రభావం వలన ఎక్కువగా కాళ్లు ఊపుతారు. అయితే ఒక సమస్యను  ఎలా తగ్గించుకోవాలి అని చాలా మందికి సందేహం ఉంటుంది. ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోవడం వలన ఈ సమస్యను దూరం చేసుకోవచ్చు. అలాగే రాత్రి సమయంలో మొబైల్ ఫోన్లు, టీవీలు చూడడం తగ్గించుకోవాలి. అంతేకాకుండా  కాఫీ, టీ లాంటి వాటిని కూడా అలవాటు చేసుకోవాలి. వీటిని పాటించడం వలన మనం కాళ్లు ఊపటాన్ని  తగ్గించుకోవచ్చని చెప్పవచ్చు. అలాగే మనం సమయానికి నిద్ర పోవడం వలన కూడా ఈ సమస్యను తగ్గించుకొని ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: