ఆవుపాలు, గేదెపాలు ఈ రెండింటిలో ఏవి మేలు..!

MOHAN BABU
ఆరోగ్యానికి పాలు చాలా మంచిది. పాలల్లో పోషక పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి.అలాగే పాలల్లో క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది.ఇది ఎముకల్ని పళ్ళని  దృఢంగా ఉంచుతుంది. డాక్టర్లు కూడా పాలని ప్రతిరోజూ తాగమని చెపుతూ ఉంటారు. పాలు తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఫిట్ గా ఉండొచ్చు. ఆవు పాలు మరియు గేద పాలు రెండిట్లో ఏది తాగాలి అనే దాని గురించి  ఇప్పుడు తెలుసుకుందాం. అయితే రెండింట్లో  కూడా కొన్ని లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి వాటి కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు దీనికోసం ఇప్పుడే పూర్తిగా చూసేయండి. దీంతో మీకు ఏ పాలు తాగితే మంచిది అన్నది క్లారిటీ వస్తుంది. పాలలో కొవ్వు పదార్థాలు కూడా ఉంటాయి. ఆవుపాలతో పోల్చుకుంటే గేదె పాలలో  ఎక్కువగా ఉంటుంది.

 అందుకనే గేదె పాలు చిక్కగా  ఉంటాయి. ఆవుపాలలో 3 నుండి 4 శాతం కొవ్వు ఉంటే, గేదె పాలలో 7 నుండి 8 శాతం కొవ్వు ఉంటుంది. దీంతో జీర్ణం అవ్వడానికి కూడా ఎక్కువ సమయం పడుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి కనుక మీరు ఎక్కువ తీసుకోవాలి అనుకుంటే ఆవుపాల ని ప్రిఫర్ చేయండి. ఆవు పాలలో 90 శాతం నీళ్లు ఉంటాయి. ఇది డిహైడ్రేషన్ కి గురై పోకుండా హైడ్రేట్ గా ఉంచుతుంది. కానీ గేదె పాలలో  అలా కుదరదు. ఇక మనం ప్రోటీన్ల  విషయానికి వస్తే ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో 10 నుండి 11 శాతం ప్రోటీన్లు ఉంటాయి . ప్రోటీన్ ఎక్కువగా గేదె పాలలో ఉండటంవల్ల పెద్దవాళ్లకు గేదె పాలను ప్రిఫర్ చేయడం మంచిది కాదు. ఇక కొలెస్ట్రాల్ విషయంలోకి వస్తే రెండు పాలల్లో కూడా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా వేరేగా ఉంటాయి. గేదె పాలలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. దీనితో పిసిఓడి హైపర్ టెన్షన్, కిడ్నీ సమస్యలు ఒబిసిటీ వంటి అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి మంచిది. కాబట్టి దీన్ని కూడా గమనించి పాలను తీసుకోవడం మంచిది .ఇక మనం ఈ రెండు పాలల్లో దేనిలో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. దేనిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి అనే విషయానికి వస్తే.. గేదె పాలలో క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి. ఎందుకంటే గేదె పాలలో కొవ్వు పదార్థాలు మరియు ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు గేదె పాలలో 237 కేలరీలు ఉంటాయి. అదే ఒక కప్పు ఆవు పాలలో 148 కేలరీలు ఉంటాయి. గేదె పాలను ఎక్కువ కాలం  ప్రిజర్వ్ చేయడానికి అవుతుంది. దీనికి గల కారణం ఏమిటంటే గేదె పాలలో హైపెరొక్సిడైజ్  యాక్టివిటీ ఉంటుంది.

అంటే ఇది ఒక ఎంజైమ్ లాంటిది. అదే ఆవుపాలను ఎక్కువ కాలం ఉంచ లేము వాటిని ఒకటి లేదా రెండు రోజుల్లో తాగేయాలి. ఈ రెండు పాలు కూడా చూడడానికి వివిధ రంగుల్లో ఉంటాయి. గేదె పాలు వైట్ క్రీం కలర్ లో ఉంటే ఆవు పాలు కాస్త ఎల్లోయిష్ ఉంటాయి. గేదె పాలలో బీటా-కెరోటిన్ పిగ్మెంట్ రంగుని లేకుండా చేస్తుంది. ఆవు పాలలో విటమిన్ ఏ ఉండడం వల్ల కాస్త పసుపు రంగు ఉంటుంది. మీరు చక్కగా నిద్ర పోవాలంటే కచ్చితంగా  గేదె పాలను ప్రిఫర్ చేయండి. అదేవిధంగా కోవా,పెరుగు, పన్నీర్, పాయసం, కుల్ఫీ,నెయ్యి వంటి వాటిని తయారు చేసుకోవడానికి కూడా గేదె   పాలే  మంచిది. అదే ఒక వేళ మీరు స్వీట్ తయారు చేసుకోవాలంటే ఆవుపాలను ప్రిఫర్ చేయడం మంచిది. అయితే రెండు పాలు కూడా ఆరోగ్యానికి మంచిదే. అయితే ఇక్కడ ఉన్న తేడాలను బట్టి మీకు ఏది బెస్టో చూసుకొని  తాగండి.కానీ ప్రతిరోజూ పాలను తాగడం మాత్రం స్కిప్  చేయొద్దు. ఎందుకంటే పాల వల్ల ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: