డ్రై ఫ్రూట్స్ ధరలు పెరగడానికి కారణం తాలిబన్లేనా..?

MOHAN BABU
ప్రస్తుత తరుణంలో విషజ్వరాలు ఎక్కువగా రావడం వలన వైద్యులు ఎక్కువగా డ్రైఫ్రూట్స్ తినాలని చెబుతున్నారు. కానీ  
డ్రై ఫ్రూట్స్ ధరలు భారీగా పెరిగాయి. కరోనా  విజృంభన  నేపథ్యంలో రోగనిరోధక శక్తిని పెంచుకునేందుకు ఆహారంతోపాటు, డ్రైఫ్రూట్స్ తీసుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఆఫ్ఘనిస్థాన్లో ఏర్పడిన సంక్షోభం ప్రభావం డ్రైఫ్రూట్స్ దిగుమతులపై పడిందని వ్యాపారులు చెబుతున్నారు. అక్కడి నుంచి దిగుమతులు నిలిచిపోవడం ఇక్కడ  డిమాండ్ తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో  ధరలు పెరిగాయని వారంటున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో కార్పొరేట్ మాల్స్,సూపర్ బజార్లు,పెద్ద షాపింగ్ మాల్స్ లో,కొన్ని రకాల స్వీట్  మార్టుల్లో మాత్రమే గతంలో డ్రైఫ్రూట్స్ లభించేవి. ప్రస్తుతం  డిమాండ్ పెరగడంతో పట్టణాలు, మండల కేంద్రంలో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేశారు. కొన్ని పచారి దుకాణాల్లో సైతం ప్రస్తుతం ఇవి  లభిస్తున్నాయి.

 డ్రై ఫ్రూట్స్ ని సరఫరా చేసే హోల్ సెల్,రిటైల్ షాపులు జిల్లాలో 500 వరకు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెల కోట్ల రూపాయల్లో అమ్మకాలు జరుగుతున్నాయి. డ్రై ఫ్రూట్స్ లో బాదం, ఎండు ద్రాక్ష,ఖర్జూరం,అంజీర లకు ఎక్కువ డిమాండ్ ఉంది  ప్రధానంగా బాదం అత్యధికంగా అమెరికా, ఆఫ్ఘనిస్తాన్ల  నుంచి దిగుమతి అవుతుంది. ఖర్జూరం అరబ్ దేశాల నుంచి వస్తుంది. అమెరికాలో వచ్చిన తుఫాన్ లకు కాలిఫోర్నియా ప్రాంతంలోని బాదం పంటకు భారీ నష్టం కలిగింది .

ఇక్కడి నుంచి ఇండియాకు బాదం ఎక్కువగా దిగుమతి అవుతుంది. అమెరికా నుంచి బాదం దిగుమతి లేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ నుంచి వ్యాపారులు దిగుమతి చేసుకుంటున్నారు. అంజీర, పిస్తా కూడా ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ నుంచే వస్తుంది. ఆఫ్ఘనిస్థాన్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం కారణంగా తాలిబన్లు ఇండియాకు ఎగుమతులను పూర్తిగా నిలిపి వేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం హోల్సెల్ మార్కెట్ లో ఉన్న స్టాక్ మాత్రమే వ్యాపారులకు సరఫరా చేస్తున్నారు. ధరలను పెంచేశారు. నెలక్రితం ప్రస్తుత ధరలు కేజీకి 100 నుంచి 200 పెరిగాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: