పిల్లలు పుట్టాలంటే స్పెర్మ్ కౌంట్ ఎంత‌ ఉండాలి..?

VUYYURU SUBHASH
మనిషి జీవితంలో తల్లి లేదా తండ్రి అవటం అనేది ఒక కీలక ఘట్టం. సంతానోత్పత్తి అనేది మనిషి జీవితాన్ని పరిపూర్ణం చేస్తుంది. సంతానోత్పత్తికి పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ అనేది చాలా ముఖ్యమైన విషయం. పురుషుల్లో ఉండే స్పెర్మ్ కౌంట్ అనే దానిని బట్టి మ‌హిళ‌ల్లో గర్భం ధరించే అవకాశాలు ప్ర‌భావితం అవుతాయి. మారుతోన్న స‌మాజ ప‌రిస్థితులు పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని తగ్గిస్తున్నాయి. ఈ క్రమంలోనే పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ క్ర‌మంగా త‌గ్గి పోతుంది. ఫలితంగా ఈ ప్రభావం గ‌ర్భ‌ధార‌ణ‌ పడుతోంది. ఈ స్పెర్మ్ కౌంట్ పెరిగేందుకు ఏ ఏ ? ఆహారం తీసుకోవాలి అనేదానిపై వైద్యులు ఎన్నో పరిశోధనలు చేశారు. సాధార‌ణంగా ఆరోగ్య‌క‌ర‌మైన వ్య‌క్తిలో ఒక మిల్లీ లీట‌ర్ వీర్యంలో సుమారు 300 నుంచి 400 మిలియ‌న్ల శుక్ర‌క‌ణాలు ఉంటాయ‌ని నిపుణులు చెపుతూ ఉంటారు.
ఈ సంఖ్య ఓవ‌రాల్‌గా 10 మిలియ‌న్ల నుంచి 20 మిలియ‌న్ల మ‌ధ్య‌లో ఉంటే దానిని స్పెర్మ్ కౌంట్ అంటారు. ఒక మ‌హిళ‌కు పురుషుడి వీర్యం ద్వారా గ‌ర్భం రావాలంటే పురుషుడిలో స్పెర్మ్ కౌంట్ అనేది 30 మిలియ‌న్ల వ‌ర‌కు ఉండాల్సి ఉంటుంద‌ట‌. ఈ స్పెర్మ్ కౌంట్ పెంచుకునేందుకు బచ్చలికూర, పాలకూర లాంటి ఇతర రకాల ముదురు ఆకుపచ్చ ఆకు కూరలు చాలా ఉప‌యోగ ప‌డ‌తాయి అట‌. మంచి స్పెర్మ్ ఉండాలంటే అందులో పోలిక్ ఆమ్లం కీల‌క పాత్ర పోషిస్తుంది అట‌.
ఇక సుర‌క్షిత మైన స్పెర్మ్ అనేది పిల్ల‌ల్లో పుట్టుక‌తో వ‌చ్చే అనేక ర‌కాల లోపాల‌ను కూడా క‌వ‌ర్ చేస్తుంద‌ని చెపుతారు. ఇక అరటిపండ్లు కూడా స్పెర్మ్ ప్రభావాన్ని పెంచే సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇక కొన్ని ర‌కాల విట‌మిన్లు సైతం మ‌నుష్యుల‌లో స్పెర్మ్ ప్ర‌భావాన్ని, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయ‌ట‌. అవి విటమిన్- బి 1, విటమిన్- ఎ, విటమిన్- సి. అందుకే స్పెర్మ్ అభివృద్ధిలో ఈ మూడు విట‌మిన్ల‌ను కీల‌కంగా చెపుతూ ఉంటారు. ఇక డార్క్ చాక్లెట్‌లో ఎల్-అర్జినిన్ హెచ్‌సీఎల్ అనే అమైనో ఆమ్లం కూడా కోరిక‌ల‌ను పెంచే ఉద్దీపనంగా ఉప‌యోగ ప‌డ‌డంతో పాటు స్పెర్మ్ కౌంట్ పెంచుతుంద‌ని చెపుతూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: