మన శరీరానికి కాపర్ అవసరాలను తీర్చే ఆహార పదార్థాలు..

Divya
శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే, అన్ని రకాల పోషకాలు అవసరమవుతాయి. ముఖ్యంగా శరీరానికి కాపర్ అనేది ఒక ముఖ్యమైన ఖనిజం లాంటిది. అయితే ఇది మన శరీరంలో ఉత్పత్తి అవదు.. బయటకు తీసుకునే ఆహార పదార్థాల ద్వారా మనకు లభిస్తుంది. కాబట్టి ఇలాంటి రాగి (కాపర్) కలిగిన ఆహార పదార్థాలను మనం తీసుకోవడం వల్ల శరీరంలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి ..? అనేది ఇప్పుడు ఒక సారి చూద్దాం..

కాపర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల,  అందులో ఉన్న రాగి పోషకం మన శరీరానికి అంది,  తద్వారా మీ శరీరంలో  కొలెస్ట్రాల్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. అంతేకాదు రోగనిరోధక వ్యవస్థ పనితీరు కూడా చక్కగా పనిచేస్తుంది. మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించి, జబ్బుల బారిన పడకుండా చూస్తుంది. మనకు ముఖ్యంగా కాపర్ ఎక్కువగా లభించే ఆహార పదార్థాలు ఏవి అంటే.. ఎండ్రకాయ మాంసంలో కూడా కాపర్ ఖనిజాలు అలాగే విటమిన్లు కూడా పుష్కలంగా లభిస్తాయి. డార్క్ చాక్లెట్ లో కూడా కాపర్  లభిస్తుంది. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది. ఇక శాకాహారులైతే పాలకూర లేదా ఏదైనా ఆకుకూరలను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన కాపర్ లభిస్తుంది..

ఎండ్రకాయ మాంసంలో కాపర్ , విటమిన్ బీ 12, సెలీనియం వంటి పోషకాలు లభిస్తాయి. అంతేకాదు ఇందులో కొవ్వు పదార్థాలు తక్కువగా ఉండి, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. శరీరానికి కావలసిన ప్రొటీన్లు కూడా పుష్కలంగా లభిస్థాయి. కాబట్టి దానిని కాల్చడం లేదా సూప్ చేసుకోవడం వంటివి చేసి ఎండ్రకాయలను ఆహారంలో చేర్చుకోవచ్చు..
డార్క్ చాక్లెట్ లో కూడా కాపర్ ఖనిజం మనకు లభిస్తుంది. అంతే కాదు ఇందులో యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ , కాపర్ కూడా తగిన మోతాదులో లభిస్తుంది. అంతేకాదు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కంటి చూపును కూడా మెరుగుపరుస్తాయి. అయితే ఇందులో క్యాలరీలు ఎక్కువగా ఉండడం వల్ల  కొవ్వు పదార్థాలు కూడా ఎక్కువగా లభిస్తాయి. కాబట్టి తక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది.
ఇక పాలకూర , ఆకుకూరల్లో శరీరానికి కావలసిన కాపర్ లభిస్తుంది. అంతేకాదు మెగ్నీషియం, ఫోలేట్  వంటి పోషకాలు కూడా సమృద్ధిగా లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: