చింతలు తీర్చే చింత చిగురు విశేషాలు ఏంటో తెలుసా ?

Divya

చింతచిగురు అంటే  తెలియని వారంటూ ఉండరు. ముఖ్యంగా ఈ వేసవి కాలంలో విరివిగా దొరికే చింతచిగురు అంటే ఇష్టపడనివారు ముఖ్యంగా ఎవరు ఉండరు.. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకూ చింతచిగురు అంటే ఎనలేని ఇష్టం. దీనిని పప్పులో, పచ్చడిలో, పులుసులో ఇలా ఎవరికి నచ్చినట్టు వారు తమ వంటకాలలో చింతచిగురును చేరుస్తూ, దీనికి వచ్చే రుచే వేరు అంటూ భోజన ప్రియులు అంటుంటారు. కేవలం ఇది రుచి కోసమే కాదు, చింతచిగురు వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
1). చింత చిగురు లో ఫైబర్ కంటెంట్ ఉండడం వలన మలబద్ధకం సమస్యను పూర్తిగా తొలగిస్తుంది. దీంతో విరేచనం సులభం అయ్యేలా  చూస్తుంది.
2). పైల్స్ ఉన్నవారు, జీర్ణాశయ సంబంధ సమస్యలు ఉన్నవారికి చింతచిగురు బాగా పని చేస్తుందని చెప్పవచ్చు.
3). చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండడంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె జబ్బులు వంటివి రాకుండా కాపాడుతుంది.
4). డయాబెటిస్ ఉన్నవారు చింతచిగురు ను ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలోని చక్కెర స్థాయి క్రమంగా తగ్గిపోతుంది.
5). ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల ఎముకల దృఢత్వానికి ఎంతో దోహదపడతాయి. అంతేకాకుండా చింత చిగురు మెత్తగా నూరి కీళ్లపై ఉంచితే నొప్పులు,వాపులు తగ్గుతాయి.
6). చింతచిగురును ఉడికించి, ఆ నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, పగుళ్ళు వంటి నోటి సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
7). మలేరియా వంటి వ్యాధుల నుంచి విముక్తి కలిగించడానికి చిగురు ఎంతగానో పనిచేస్తుంది.
8). కడుపులో నులిపురుగులకు కూడా చింతచిగురు మంచి ఔషధంగా పనిచేస్తుంది.
9). చింత చిగురును వేడి నీళ్లలో మరిగించి, కొంచెం తేనె కలుపుకొని తాగితే సాధారణ జలుబు, దగ్గు వంటి సమస్యలు మాయమవుతాయి.
10). కళ్ళు దురద గా ఉన్నప్పుడు కొంచెం చింతచిగురు తింటే వెంటనే ఉపశమనం లభిస్తుంది.
11). అంతేకాకుండా థైరాయిడ్  సమస్యతో బాధపడేవారికి కూడా ఇది ఎంతో మంచి ఔషధంగా పనిచేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: