ఆ తల్లుల్ల ముఖంలో ఆనందమే.. తన సంతోషం అనుకుంటున్న డా. సరిపల్లి శ్రీజారెడ్డి?

praveen
ఏ తల్లి అయినా సరే తమ పిల్లలు పెరిగి ప్రయోజకులు కావాలి అని అనుకుంటుంది. కానీ కొంతమంది చిన్నారులు మాత్రం చిన్నప్పటినుంచి బుద్ధిమాంద్యం సమస్యతో బాధపడుతూ ఉండడం ఎంతో మంది తల్లులను కలిచి వేస్తూ ఉంటుంది. ఇలాంటి ఆటిసం సమస్యకు దేశవిదేశాలకు తిరిగినా  నయం కాని పరిస్థితులు కూడా ఉన్నాయ్. ఇలా తమ పిల్లల భవిష్యత్తు మొత్తం అంధకారంలో మునిగిపోయింది అని ఆందోళనలో ఉన్న ఎంతో మంది తల్లులకు నేనున్నాను అంటూ ధైర్యం చెబుతున్నారు డాక్టర్ సరిపల్లి శ్రీజా రెడ్డి.

చిన్న వయసులోనే బుద్ధిమాంద్యం సమస్యను గుర్తించి ఆటీజం సమస్యకు పరిష్కారం చూపించేందుకు ఎంతో మంది తల్లుల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసేలా చేసేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు డాక్టర్ సరిపల్లి శ్రీజా రెడ్డి.  అంతేకాదు వైద్యం చేయించుకునే స్తోమత లేని ఎంతో మంది తల్లులకు అండగా నిలుస్తూ ఆటజం బారిన పడిన వారి చిన్నారులకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. బుద్ధిమాంద్యం తో బాధపడుతున్న చిన్నారులను సమస్యకు పరిష్కారం చూపించిన తర్వాత ఇక ఆ తల్లుల ముఖంలో కనిపించిన ఆనందంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటున్నారు ఈ డాక్టరమ్మ.
 వినూత్న రీతిలో ఆటిజం సమస్యకు చెక్ పెడుతూ చిన్నారుల భవిష్యత్తుకు బాటలు వేసిన మరో తల్లి గా మారిపోతున్నారు సరిపల్లి శ్రీజా రెడ్డి.  సాధారణంగా అయితే బుద్ధిమాంద్యం అనేది దీర్ఘకాలిక సమస్య చికిత్స అందించినప్పటికీ ఎప్పుడు ఏమవుతుందో చెప్పడం చాలా కష్టం అయినప్పటికీ తన వద్దకు వచ్చిన ఎంతోమంది తల్లుల్లో ధైర్యాన్ని నింపుతు.. వారిలో పిల్లలకు బంగారు భవిష్యత్తు ఉంటుంది అనే నమ్మకాన్ని కలిగిస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు సరిపల్లి శ్రీజా రెడ్డి. ఇలా సమాజ సేవ కోసం ఎంతో మంది తల్లుల ఆనందం కోసం పరితపిస్తూ నిరంతరం శ్రమిస్తున్న డాక్టరమ్మా సరిపల్లి శ్రీజా రెడ్డి నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఎంతో మంది ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు.

" >


" >


" >


" >

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: