వృద్ధులు తప్పకుండా తీసుకోవలసిన ఆహారాలు ఏంటో తెలుసా..?

Divya

సాధారణంగా వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఏం తినాలన్నా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి వారు తీసుకునే ఆహారంలో  తేలికగా  జీర్ణం అయ్యే ఆహార పదార్థాలు కంపల్సరిగా ఉండేలా చూసుకోవాలి . ముఖ్యంగా 50 సంవత్సరాల వయసు పైబడిన వారిలో మెటబాలిజం మందగిస్తుంది. అంటే శరీరం కేలరీలను తక్కువగా ఖర్చు చేస్తుంది . ఈ విషయాన్ని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ వెల్లడించింది. వీరిలో జీర్ణశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి , తక్కువ కేలరీలను అందించే ఆహారాలు మాత్రమే తీసుకోవడం ఎంతో అవసరం.  అంతేకాకుండా వయస్సు పైబడుతున్న కొద్దీ ఎక్కువగా హై బీపీ,  గుండె జబ్బులు , డయాబెటిస్ , క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తుంటాయి . అందుకే జాగ్రత్తగా ఉండాలి. అందుకే నిత్యం సరైన జీవనశైలిని పాటిస్తే,  ఈ రోగాలు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు.  అందుకుగాను ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది..
బీట్ రూట్
బీట్ రూట్ లో పోషకాలు మెండుగా ఉంటాయి. శరీరానికి కావలసిన ప్రోటీన్లను అందించడంలో బీట్రూట్ మొదటి పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా ఇవి బీపీ ని కూడా తగ్గిస్తాయి. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది .కాబట్టి రక్తసరఫరా మెరుగుపడుతుంది.

అవకాడో
అవకాడో లో గుండె ఆరోగ్యానికి సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి, బీపీని అదుపులో ఉంచుతాయి. అంతే కాకుండా గుండె జబ్బులు వచ్చే అవకాశాలను కూడా పూర్తిగా తగ్గిస్తాయి.
బెర్రీలు
బెర్రీలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల క్యాన్సర్ కణాలను నాశనం చేసి క్యాన్సర్ రాకుండా ఉండేలా చేస్తాయి.
కోడిగుడ్లు
వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా సరే కండరాలు బలహీనంగా మారడం సహజం. అలాంటప్పుడు వాటిని దూరంగా ఉంచేందుకు ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి . కోడిగుడ్లలో ప్రోటీన్లు పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల కండరాలు దృఢంగా మారుతాయి.
చేపలు
చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి అని మనందరికీ తెలుసు. వాపులను తగ్గించి , రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోకుండా చూస్తాయి. చేపలు తినడం వల్ల క్యాన్సర్లతో పాటు గుండె జబ్బులు రాకుండా ఉంటాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: