ఇంట్లో ఉండే వాటితోనే ముఖ సౌందర్యం... ఎలా అనుకుంటున్నారా..? అయితే ఇక్కడ చదవండి...

kalpana
 ముఖము అందంగా కనబడటానికి మార్కెట్లో దొరికే అన్ని క్రీములను వాడుతూ ఉంటాము. కానీ అవి కొంత మందికి సైడ్ ఎఫెక్ట్స్ స్థాయి.  లేదంటే కంటిన్యూగా వాడుతూ ఉండాలి. మధ్యలో ఆపివేసిన  మళ్లీ మామూలే అవుతుంది. అలా  జరక్కుండా ఉండాలంటే ఇంట్లో దొరికే వాటితోనే అందాన్ని పెంచుకోవచ్చు. అవి ఎలానో ఇప్పుడు చూద్దాం...                               
 ముఖాన్ని రసాయనాలతో తయారుచేసిన సబ్బుతో దిద్దుకునే కంటే మెత్తని శెనగపిండితో దిద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగానూ, కాంతివంతంగా ఉంటుంది.
 ముఖానికి బీట్రూట్ రసం రాసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవాలి వల్ల ముఖవర్చస్సు  పెరుగుతుంది.
 శనగపిండిలో కీరదోస రసం కాని, క్యారెట్ రసం గాని, కలిపి పేస్ట్ లా చేసి ముఖానికి పట్టించి గంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 గులాబీ రెక్కలను పేస్ట్ లా తయారు చేసుకొని ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖము కాంతివంతంగాను,  ఆకర్షణీయంగా ఉంటుంది.
 ముఖ సౌందర్యం పెరగడానికి గ్లిజరిన్ లో నిమ్మరసం, టమాటా రసం కలిపి  ముఖానికి పట్టించాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యం పెరుగుతుంది.
 ఎండిన కమలా పళ్ళ తొక్కలను మెత్తగా పొడిచేసి ఆ పొడిలో  పసుపు,శనగపిండి రోజు వాటర్ కలిపి పేస్టులా తయారు చేసుకోవాలి. ఆ పేస్ట్ ను ముఖానికి  పట్టించి గంట తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల ముఖము కాంతివంతంగాను, ఆకర్షణీయంగా కనబడుతుంది.
 జిడ్డు  ముఖము ఉన్నవాళ్లు సబ్బుకు బదులు మెత్తని సున్నిపిండితో ముఖం కడుక్కోవడం వల్ల ముఖం శుభ్రంగా ఉంటుంది.
 బాదం నూనెలో నిమ్మరసం, తేనే కలిపి  ముఖానికి బాగా అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై  మొటిమలు, మచ్చలు తగ్గడమే కాకుండా, ముఖం మృదువుగా ఉంటుంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: