అందానికి బీట్ రూట్... ఎలా అనుకుంటున్నారా..?

kalpana
 అందంగా కనబడటానికి మార్కెట్ లో దొరికే క్రీములు అన్ని  వాడుతూ ఉంటాం. కానీ సైడ్ ఎఫెక్ట్ వచ్చి ఉన్న అందం కూడా  పాడవుతుంది.  ఏవో కొన్ని మాత్రమే కొంచెం బాగా పని చేస్తూ ఉంటాయి. కొంతమందికి క్రీములు  సెట్ అవ్వవు. ఇలాంటి వారు బీట్రూట్ ను ఉపయోగించి అందాన్ని పెంచుకోవచ్చు ఎలానో ఇక్కడ తెలుసుకుందాం...                                     
 గుప్పెడు ఓట్స్ తీసుకొని, కొన్ని బీట్రూట్ ముక్కలను తీసుకుని మెత్తగా పేస్ట్ మాదిరిగా తయారు చేయాలి. ఇందులోకి ఒక స్పూన్ తేనె, కాస్త నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మునివేళ్లతో మర్దన చేయాలి. కొద్ది సమయం తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. తర్వాత రెండు నిమిషాలాగి నీటిని మరిగించి ఆ నీటితో ఆవిరిపట్టండి వల్ల ముఖం కాంతివంతంగా ఉంటుంది.
 కొన్ని బీట్రూట్ ముక్కలు తీసుకొని మెత్తగా ఫేస్ లా తయారు చేసుకొని అందులోకి  ఒక స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొనను కలిపి మెడకు, ముఖానికి  రాసుకుని ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతలు లేకుండా పోతుంది.
 బీట్రూట్ రసానికి కొంచెం తేనె కలిపి పెదాలకు రాసుకోవాలి. 10  నిమిషాల తర్వాత కడుక్కోవాలి. ఇలా రోజూ రాత్రి పడుకోబోయే ముందు రాస్తే పెదాలు మృదువుగా మారతాయి.
 బీట్రూట్ రసంలో కొంచెం బాదం నూనె, పెరుగు, ఒక స్పూన్ ఉసిరిక పొడి కలిపి పేస్ ఎలా తయారు చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి కాకుండా, కండీషనర్గా ఉపయోగపడుతుంది.
 జుట్టు తెల్లబడుతుంది అని అనేక రకాల రంగులు వేస్తూ ఉంటారు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్ కూడా వస్తాయి. ఇలా  జరక్కుండా ఉండాలంటే, బీట్రూట్ రసాన్ని వారానికి ఒకసారి తలకు పట్టించి 30 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. దీనివల్ల  జుట్టు చక్కని రంగులో కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: