"బరువు" తగ్గించే క్రమంలో ఈ జాగ్రత్తలు మర్చిపోవద్దు..!!!

NCR

అధిక బరువు ఎన్నో అనర్దాలకి చేటు. ఈ విషయం అందరికి తెలిసిందే కానీ పాటించడానికి మాత్రం వెనుకాడుతారు. కొంతమంది మాత్రం టెక్నాలజీ మారింది కదా అన్ని ఫాస్ట్ ఫాస్ట్ గా అయ్యిపోతున్నాయి కాబట్టి బరువు కూడా ఫాస్ట్ గా తగ్గిపోయే అవకాశం ఉందా అంటూ ఆలోచనలు చేస్తున్నారు.అధిక బరువు వలన మనిషి శరీరాన్ని ఆవరించే జబ్బు మొదటిగా షుగర్, రెండు గుండె జబ్బులు. ఈ రెండు స్థూలకాయం వలన శరీరంలోకి వచ్చి తిష్టవేస్తాయి. అయితే బరువు తగ్గాలని ఎంతో మంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ చిన్న చిన్న జాగ్రత్తలు మాత్రం మర్చిపోతూ ఉంటారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం..

 

 

బరువు తగ్గాలంటే కొన్ని పద్దతులని పాటించక తప్పదు. చాలా మంది అనుకునేది ఎక్కువగా తినేస్తున్నాం అందుకే లావు అయ్యిపోతున్నాం అనుకుంటారు. వ్యాయామం చేస్తున్నాం కదా సన్నబడటం లేదని ఫీల్ అవుతుంటారు. కానీ చిన్న చిన్న విషయాల్ని తెలుసుకోరు. ముఖ్యంగా నిద్ర లేమి అనేది అధిక బరువు పెరగడానికి ఓ ప్రధాన కారణం అందుకే సమయానికి నిద్ర పోవడం ఎంతో ఉత్తమం. చాక్లెట్లు , డార్క్ బిస్కెట్లు, అధిక శాతం కొవ్వుతో ఉండే ఐస్ క్రీములు అన్నీ అధిక బరువు పెరగడానికి కారణాలే అయితే మరీ తినవద్దని చెప్పలేము కానీ ఎప్పుడైనా ఒక సారి అనే పద్దతి అలవాటు చేసుకోవడం మంచిది.

 

అలాగే కాఫీ, టీ లలో చెక్కెర ఎక్కువ లేకుండా చూసుకోవడం ఎంతో మంచిది. ముఖ్యమైన విషయం ఏమిటంటే. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు కలిగిన పళ్ళు తీసుకోవడం ఎంతో మంచిది. ఇవి శరీరంలో అధిక కొవ్వుని పెరగనివ్వవు. అంతేకాదు అధికశాతం పీచు పదార్ధాలు ఉన్న ఆహరం తీసుకుంటే తిన్న ఆహరం తొందరగా జీర్ణం అయ్యి పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోదు. ముఖ్యంగా బిజీ బిజీ అంటూ సమయానికి ఫుడ్ తినకుండా ఉండటం మంచిది కాదు. ఉదయం లేచిన తరువాత తప్పకుండా ఎదో ఒక ఆహరం తీసుకోవడం మంచిది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: