పొత్తికడుపు కొవ్వు తగ్గాలంటే ఇలా చెయ్యండి..!

Durga Writes
కొందరికి శరీర ఆకృతి అంతా అందంగా ఉంటుంది. కానీ పొట్ట దగ్గరకు వచ్చేసరికి అందవిహీనంగా ఉంటుంది. అందుకు ఏకైక కారణం అక్కడ పేరుకుపోయిన కొవ్వు. వయసుకు సంబంధం లేకుండా కొవ్వు అంత పేరుకుపోయింటుంది. అయితే ఆ కొవ్వు తగ్గాలంటే మీరు రోజు చేసే వ్యాయామంతో పాటు ఇక్కడ ఉన్న ఆహారపదార్ధాలను తీసుకుంటే పొత్తికడుపు చుట్టూ అతిగా పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగించుకోవచ్చు. ఆ ఆహారం ఏంటో ఇక్కడ చూసి తెలుసుకోండి. 


నిమ్మరసం కొవ్వును కరిగిస్తుంది. అందుకే ఉదయం లేవగానే గ్లాసెడు గోరు వెచ్చని నీటిలో నిమ్మకాయను పూర్తిగా పిండి తాగాలి. 


పరగడుపునే గోరువెచ్చని నీటిలో చెంచాడు అల్లం రసం కలుపుకొని తాగితే పొత్తికడుపు చుట్టూ అతిగా చేరిన కొవ్వు క్రమంగా కరుగుతుంది.


ఉదయం నిద్రలేవగానే నోరు పుక్కిలించి రెండు వెల్లుల్లి రెబ్బ‌ల్ని తింటే పొట్ట కిందిభాగంలో చేరిన కొవ్వు కరిగిపోతుంది.


రోజూ అల్పాహారానికి ముందు 4 చెంచాల పుదీనా ఆకుల రసం తాగితే పొట్ట కరగటమే గాక జీవక్రియల వేగం కూడా పెరుగుతుంది .


ఉదయం, సాయంత్రం భోజనానికి అరగంట ముందు గ్లాసు కీరదోసకాయ రసం తాగితే పొట్టచుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.


చూశారుగా ఇందులో ఏ ఒక్క చిట్కా క్రమంగా పాటించిన పట్టిన కొవ్వు ఇట్టే కరిగిపోతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: