దేశంలో నిలకడగా బంగారం,వెండి ధరలు ఇలా..!

Satvika
పసిడి ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్..నిన్న భారీగా తగ్గిన బంగారం ధరలు,ఈరోజు ఇంకాస్త కిందకు దిగి వచ్చింది.దేశంలో బంగారం, వెండికి ఎంతో ప్రాధాన్యతనిస్తుంటారు మహిళలు..రోజూ బంగారం, వెండి ధరలు పెరుగుథూ,తగ్గుతూ వస్తున్నాయి.మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు..

నేడు మార్కెట్ లో ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద కొనసాగుతోంది.విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 ఉంది.చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,090 వద్ద ఉంది.ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది.

కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 వద్ద ఉంది.బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,680 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,010 ఉంది.కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,650 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,980 వద్ద ఉంది..బంగారం స్థిరంగా ఉంటే, వెండి ధరలు కొద్దిగా తగ్గాయి..ఢిల్లీలో కిలో వెండి ధర రూ.60,900 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.66,300 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.66,300 ఉండగా, చెన్నైలో రూ.66,300 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.60,900 వద్ద ఉంది. మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: