నవంబర్ 14 బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే ?

Vimalatha
ఈరోజు భారత్‌లో ఈరోజు బంగారం ధరలు రూ.10/10 గ్రాములు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 48,280 / 10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 49,280/10 గ్రాములు ఉంది. 50 వేల మార్కును దాటడానికి పసిడి సిద్ధమవుతోంది. మరోవైపు అహ్మదాబాద్‌లో నేడు బంగారం ధరలు రూ. 800 పెరగడం షాక్ ఇస్తోంది. ప్రస్తుతం ఉన్న ప్రపంచ ఆర్థిక దృక్పథం బంగారంతో సహా ఆస్తుల మార్కెట్లకు సానుకూలంగా ఉంది.
కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 0.25% పెరిగి, $ 1868/oz వద్ద కోట్ అయ్యాయి. అయితే స్పాట్ గోల్డ్ ధరలు 0.17% పెరిగాయి. చివరి ట్రేడింగ్ వరకు $1866/oz వద్ద కోట్ అయ్యాయి. నిన్న కామెక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ అత్యధిక రీచ్ $ 1871/oz కు చేరుకుంది. మరోవైపు స్పాట్‌ మార్కెట్‌లో అమెరికా డాలర్‌ ఇండెక్స్‌ 95.07గా ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ పరంగా భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం కూడా 0.26% పెరిగింది. చివరి ట్రేడింగ్ వరకు రూ. 49,346/10 గ్రాములకు చేరుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం మార్కెట్లు చాలా కాలం తర్వాత నిన్న $ 1870 / oz స్థాయిని చేరుకున్నాయి. యూఎస్ఏ ద్రవ్యోల్బణం డేటా 6.2% వద్దకు చేరిన తర్వాత బంగారం ధరలు బాగా పెరిగాయి. ఫ్రాంక్ చోలీ, RJO ఫ్యూచర్స్ సీనియర్ మార్కెట్ వ్యూహకర్త మాట్లాడుతూ "ద్రవ్యోల్బణం ఎక్కువ కాలం కొనసాగుతుందనే వాస్తవాన్ని మార్కెట్ స్వీకరించడం ప్రారంభించింది. మహమ్మారి కారణంగా సరఫరా చైన్ సమస్యలను పరిష్కరించడానికి సంవత్సరాలు పడుతుంది. గోల్డ్ కు డిమాండ్ కూడా భారీగా ఉందని అన్నారు. ఇక రానున్న రోజుల్లో బంగారం ధరలు మరింత పైపైకి ఎగిసే అవకాశం ఉంది. ఇప్పటికే పెరిగిన పసిడి ధరలు సామాన్యుడిని అందనంత ఎత్తులో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: