మగువలకు షాక్... భారీగా పెరిగిన బంగారం ధరలు

Vimalatha
ఈరోజు భారతీయ బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 260 పెరిగింది. ఈ రోజు 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,250 / 10 గ్రాములు, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 48,250 / 10 గ్రాములు. కోల్‌కతా, ఢిల్లీ, కేరళ, హైదరాబాద్ వంటి ప్రధాన భారతీయ నగరాల్లో బంగారం ధరలు 10 గ్రాములకు రూ. 200 పెరగగా, అహ్మదాబాద్‌లో మాత్రం 10 గ్రాములకు రూ. 300 పెరిగింది.
కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ ఈ రోజు 0.20% పడిపోయి, $ 1827/oz వద్ద కోట్ అయ్యింది. అయితే స్పాట్ గోల్డ్ ధరలు 0.40% తగ్గాయి. నిన్న సాయంత్రం 4.10 గంటల వరకు $ 1825/oz వద్ద కోట్ అయ్యాయి. మరోవైపు స్పాట్ మార్కెట్లో US డాలర్ ఇండెక్స్ నిన్నటి కంటే 0.14% లాభపడి 94.10 వద్ద ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ట్రెండ్‌ ప్రకారం భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌ లో ముంబై MCX బంగారం కూడా 0.07% పెరిగింది. నిన్న సాయంత్రం వరకు బంగారం ధర రూ. 48,322/10 గ్రాములు. కామెక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ $1830/oz స్థాయి వద్ద ముగిసింది. బంగారం 2020 ఆగస్ట్ నుండి $1834/36 వద్ద జూలై, ఆగస్టు గరిష్టాల కంటే కొంచెం దిగువన, డౌన్-ట్రెండ్‌లో ఉంది. అయితే స్వల్పకాలికంలో మరింత మెరుగుపడింది.
దీపావళి తర్వాత బంగారం పెరుగుదల కనిపించింది. అయితే మంగళవారం కాస్త తగ్గింది. ఈ రోజు మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో బంగారం ఉదయం 9.25 వద్ద 0.14% పడిపోయింది. వెండి విషయానికొస్తే... నేడు వెండి MCXలో జంప్ నమోదు చేసింది. వెండి ధర 0.37 శాతం పెరిగింది. కిలో రూ.237 పెరగడంతో దాని ధర రూ.64,807గా నమోదైంది. దీని చివరి ముగింపు ధర రూ.64,570 స్థాయిలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: