గోల్డ్ ఇటిఎఫ్‌ను అమ్మడం లేదా రీడీమ్ చేయడం ఎలా?

Vimalatha
నేడు పుత్తడి ధర భారీగా పెరిగి షాక్ ఇచ్చింది. 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.330 పెరిగి 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,330కు, 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.44,300కు చేరుకుంది. ఇక కేజీ వెండి ధర రూ.67,700గా ఉంది.
గోల్డ్ ఇటిఎఫ్ లేదా ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ అనేది బంగారం పెట్టుబడి ఆధారిత మ్యూచువల్ ఫండ్. ఈ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ వ్యక్తిగత స్టాక్స్ లాగా పని చేస్తాయి. స్టాక్ ఎక్స్ఛేంజీలో అదే విధంగా అమ్మొచ్చు. ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ఆస్తులను సూచిస్తాయి. సందర్భంలో ఫిజికల్ గోల్డ్, డీమెటీరియలైజ్డ్, పేపర్ రూపంలోఒక పెట్టుబడిదారుడు అసలు మెటల్‌కు బదులుగా స్టాక్స్‌లో పెట్టుబడి పెడతాడు. అది అమ్మిన తర్వాత పెట్టుబడిదారుడికి అసలు బంగారానికి బదులుగా యూనిట్‌కు సమానమైన నగదును జమ చేస్తారు.
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకునే పెట్టుబడిదారులకు గోల్డ్ ఇటిఎఫ్‌లు అనువైనవి. బంగారం స్వచ్ఛతపై సందేహం కారణంగా చాలామంది ఫిజికల్ గోల్డ్ పై పెట్టుబడి పెట్టడానికి అంతగా ఇష్టపడట్లేరు. పైగా ఇటిఎఫ్‌ లలో పన్ను ప్రయోజనాలను కూఇంకో విషయం ఏమిటంటే తక్కువలో తక్కువ ఒక గ్రాము బంగారాన్ని కూడా కొనుగోలు చేయవచ్చు.
గోల్డ్ ఇటిఎఫ్‌లు 99.5% స్వచ్ఛమైనవి. గోల్డ్ ఇటిఎఫ్‌ ధరల జాబితా BSE/NSE వెబ్‌సైట్‌లో ఉంటాయి. స్టాక్ బ్రోకర్ ద్వారా ఎప్పుడైనా కొనుగోలు చేయవచ్చు లేదా అమ్మవచ్చు. బంగారు ఆభరణాలలా కాకుండా బంగారం ఇటిఎఫ్‌ను ఇండియాలో ఎక్కడైనా సరే అదే ధర వద్ద కొనుగోలు చేయవచ్చు, అమ్మవచ్చు. డిమాట్‌లో ఉన్న యూనిట్‌లుగా సురక్షితంగా ఉంటాయి. డిపాజిట్ లాకర్ ఛార్జీలను కూడా ఆదా చేయొచ్చు. పైగా దొంగతనం జరుగుతుందన్న భయం ఉండదు. ఎంట్రీ మరియు ఎగ్జిట్ లోడ్ లేదు.
ఎక్కడ కొనాలి:
గోల్డ్ ఇటిఎఫ్‌లను బిఎస్‌ఇ/ఎన్‌ఎస్‌ఇలో డీమ్యాట్ ఖాతా, ట్రేడింగ్ ఖాతాను ఉపయోగించి బ్రోకర్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. బంగారం జాబితా లను కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు బ్రోకరేజ్ ఫీజు, చిన్న నిధుల నిర్వహణ ఛార్జీలు వర్తిస్తాయి,
ప్రమాదాలు:
గోల్డ్ ఇటిఎఫ్‌లు బంగారం ధరను ప్రభావితం చేసే మార్కెట్ ప్రమాదాలకు, సెబి మ్యూచువల్ ఫండ్స్ నిబంధనలకు లోబడి ఉంటాయి. చట్టబద్ధమైన ఆడిటర్ ద్వారా ఫండ్ హౌస్‌లు కొనుగోలు చేసిన భౌతిక బంగారాన్ని రెగ్యులర్ ఆడిట్ చేయడం తప్పనిసరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: