ఫిజికల్ గోల్డ్ అంటే ఏంటి ? దాని లాభనష్టాలు ఏంటి ?

Vimalatha
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 46,380, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 47,380 గా ఉంది. నేడు బంగారం ధర రూ. 120 రూపాయలు తగ్గింది. కేజీ వెండి ధర రూ. 63,500గా నమోదు అయింది.
ఫిజికల్ గోల్డ్ భారతదేశంలో సాంప్రదాయక పెట్టుబడి. ఈ పసుపు లోహం సాధారణంగా మనం ఉపయోగిస్తుంటూనే ఉంటాము. నగలు, బంగారు నాణేలు, బిస్కెట్ల రూపంలో ఉండే బంగారాన్ని ఫిజికల్ గోల్డ్ అంటారు. దీన్ని నేరుగా మధ్యవర్తి ప్రమేయం లేకుండా జ్యువెలర్ లేదా బ్యాంక్ నుండి కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా భౌతిక బంగారం కొనుగోలు అనేది ఇతర రకాల పెట్టుబడులకు భిన్నంగా గోప్యంగా ఉంచుతారు. అయితే, ఆదాయపు పన్ను ప్రయోజనాల కోసం కొనుగోలుకు సంబంధిత రసీదులన్నింటినీ సురక్షితంగా ఉంచడం మంచిది. భౌతిక బంగారంపై కనీస పెట్టుబడి ఎక్కువ. అధిక మార్కెట్ ధరల కారణంగా డిజిటల్ గోల్డ్ కంటే ఫిజికల్ గోల్డ్ లో అత్యధిక కనీస పెట్టుబడి ఉంది. భౌతిక బంగారంపై పెట్టుబడి పెట్టడంలో ఒక ప్రధాన ప్రయోజనం లిక్విడిటీ.
ఈ పసుపు లోహాన్ని డబ్బులకు బదులుగా ఎక్కడైనా తీసుకుంటారు. అందువల్ల దీనిని ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా లిక్విడేట్ చేయవచ్చు. బంగారం ధర డీలర్ నుండి డీలర్‌కు మారుతూ ఉంటుందని, రీసేల్ విలువ సాధారణంగా ఇతర రకాల బంగారం పెట్టుబడి కంటే తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. సంక్షోభ సమయంలో దీన్ని సులభంగా అమ్మవచ్చు. ఫిజికల్ గోల్డ్‌లో పెట్టుబడి పెట్టడం వల్ల నష్టాలు, నిల్వ ఖర్చు. మేకింగ్ ఛార్జీలు, కొనుగోలు వ్యయం కాకుండా, ఫిజికల్ గోల్డ్ కు అధిక మేకింగ్ ఛార్జీలు వర్తిస్తాయి. భౌతిక బంగారం ఎల్లప్పుడూ దొంగతనం జరిగే ప్రమాదం ఉంది. 30 లక్షల కంటే ఎక్కువ బంగారం కొనుగోలు చేస్తే సంపద పన్ను చెల్లించాలి. డిజిటల్ గోల్డ్, ఫిజికల్ గోల్డ్ మధ్య తేడా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: