బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్

Vimalatha
పసిడి ప్రేమికులకు ఊరట నిచ్చే న్యూస్ ఇది. గత కొంతకాలంగా వరుసగా పెరుగుతూ భయపెడుతున్న బంగారం ధరలు నాలుగు రోజుల నుంచి కొంత మేర తగ్గడం లేదంటే, స్థిరంగా ఉంటూ ఊరటనిస్తున్నాయి. ఈ టైములో బంగారం కొనాలనుకునే వారికి ఇది నిజంగా శుభవార్తే. రెండ్రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం కాస్త తగ్గింది. కానీ ఈ రోజు మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి మాత్రం పెరిగింది. వెండి ధర రూ.400 పెరిగింది. పెరిగిన తో కలిపి కేజీ వెండి ధర రూ.73,100కు చేరుకుంది. నిన్న ఇదే రూ.400 తగ్గిన వెండి ధర రూ.72,700గా ఉంది. మన రాష్ట్రాల్లోని ముఖ్యమైన నగరాల్లో హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ వంటి ప్రాంతాల్లో ఇదే ధర కొనసాగుతుంది. ఇతర ప్రాంతాల్లోని వెండి ధరల్లో మార్పు ఉంటుంది. ఇక బంగారం విషయానికొస్తే... 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.44,900కు, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980కి చేరుకుంది. అయితే స్థానిక మార్కెట్లో, అలాగే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయనే విషయం గమనిస్తూ ఉండాలి.
హైదరాబాద్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
ఢిల్లీ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,050
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,330
 
విజయవాడ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
వైజాగ్ :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
బెంగళూరు:  
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,900
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,980
ముంబై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,960
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,960
 
చెన్నై :
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,330
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,450

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: