పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. ఈరోజు ధరలు ఇవే!

Chaganti
బంగారంపై పెట్టుబడులు పెట్టడం ఈ రోజు మొదలయింది కాదు. మన తాతల తరాల్లోనే ఇలా బంగారం మీద పెట్టుబడులు పెట్టడం శ్రేయస్కరం అని భావిస్తూ ఉండేవారు. జీవితకాలంలో బంగారం కొనడం ఉపయోగకరంగా ఉంటుందని దాదాపు అందరు భారతీయులు లెక్కించారు. ఆ విధంగా, చేతిలో డబ్బు ఉన్నప్పుడు బంగారంలో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే, కరోనా కారణంగా ఈ బంగారం మీద పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య బాగా తగ్గిందనే చెప్పాలి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడంతో ఎక్కువ శాతం ఆర్థిక లావాదేవీలు నిలిచిపోయాయి. 


రియల్ ఎస్టేట్ సహా అనేక వ్యాపారాలు వెనుకబడ్డాయి. ఇది బంగారు మార్కెట్‌పై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపింది. లాక్డౌన్ క్లియర్ కావడంతో నెమ్మదిగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. జిఎస్‌టి లేదా సర్వీస్ టాక్స్ బంగారం కొనుగోలు విషయంలో స్టాక్ మార్కెట్‌ను ప్రభావితం చేస్తుంది. ఆయా రాష్ట్రాలు విధించిన సర్వీస్ టాక్స్  కారణంగా ఇతర రాష్ట్రాల్లో బంగారం ధరలు హెచ్చుతగ్గులకు గురయ్యే అవకాశం ఉంది. 


గత రెండు నెలలుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే ఈరోజు మాత్రం పరుగులు పెట్టకుండా ఈ ధర స్థిరంగా ఉంది.  ఇక నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయని చెక్ చేస్తే కనుక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,900గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,950గా ఉంది ఇక మరో పక్క దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,810గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,810గా ఉంది. ఇక హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820గా ఉంది అంతేకాక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,820గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: