స్వల్పంగా తగ్గిన బంగారం.. అదే దారిలో వెండి..!!

Satvika
పసిడి ప్రియులకు మరో శుభవార్త.. బంగారం ధరలు ఒక్కసారిగా కిందకు దిగి వచ్చాయి. మొన్నటి దాకా పరుగులు పెట్టిన బంగారం ధరలు నేడు నేల చూపులు చూస్తున్నాయి.నిన్నటితో పోలిస్తే ఈ రోజు ధరలు ఊరట కలిగిస్తున్నాయి. ఈ మేరకు ఆదివారం కొనుగోళ్లు కూడా పెరిగాయి. గత కొన్ని నెలలుగా పెరుగుతూ వస్తున్నా ధరలు ఇటీవల తగ్గుతూ వచ్చాయి.. మూడు రోజుల నుంచి స్వల్పంగా కిందకు దిగి వస్తున్నాయి. విదేశీ మార్కెట్ లో కొనుగోళ్లు పెరగడంతో,ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా పడిపోయాయని నిపుణులు అంటున్నారు. 



అయితే బంగారం ధరల రేట్ల పై వెండి రేట్లు కూడా ఆధారపడి పయనిస్తున్నాయి.. కరోనా సమయంలో ఆల్ టైమ్ హైకి చేరిన బంగారం ధరలు, ఇప్పుడు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.45,950కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 తగ్గి రూ.50,130కి చేరింది. కిలో వెండి ధర రూ.50 తగ్గి రూ. 71,350కి చేరింది.



పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ప్రధాన కారణమని తెలుస్తోంది. ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వంటి మొదలగు వాటి వల్ల  మార్కెట్ లో బంగారు ఆభరణాల డిమాండ్ తగ్గడం వంటి వాటి వల్ల రేట్లు పూర్తిగా కిందకు దిగి వస్తున్నాయి.. అంతర్జాతీయ మార్కెట్ బంగారం ధర ఔన్స్‌కు 0.28 శాతం పెరుగుదలతో 1886 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్‌కు 0.09 శాతం పెరుగుదలతో 25.98 డాలర్లకు చేరింది. త్వరలో ఉగాదికి ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: