శుభవార్త.. భారీగా తగ్గిన వెండి ధర.. గోల్డ్ రేటు జిగేల్..!!

Satvika
దసరా , దీపావళి పండుగలు వెంట వెంటనే రావడం ప్రజల ఆనందాలకు హద్దులు లేకుండా పోతాయి..ఎందుకంటే ఈ రెండు పండుగలకు వస్తువుల కొనుగోలు పై భారీ తగ్గింపు లతో జనాలు కొనడానికి ఎగబడతారు. దుకాణదారులు కూడా జనాలను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే వస్తువులపై భారీ డిస్కౌంట్ లతో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.. భారీగా ఈ నెలలో వస్తువుల కొనుగొల్లు కూడా జరుగుతున్నాయి. ఇకపోతే పండగ అంటే ఆడవాళ్ళకు ముందుగా గుర్తొచ్చేది మాత్రం బంగారు నగలు.. దసరా తర్వాత కొనుగోళ్లు పెరగడంతో రేట్లు మళ్లీ ఊపందుకున్నాయి.

 
ప్రస్తుతం బంగారం రేట్లకు కళ్లెం వేసేందుకు ప్రయత్నించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది.. మొన్నటి నుంచి పెరిగిన రేట్లు ఇప్పటికీ అంతకు మించి పెరుగుతున్నాయి.. నిన్నటి రేట్లతో పోలిస్తే ఈరోజు ఇంకాస్త పెరిగింది.. పసిడి ధర పరుగులు పెడుతూనే వస్తోంది. బంగారం ధర ఈరోజు కూడా పైకి కదిలింది. పసిడి ధర పెరగడం ఇది వరుసగా మూడో రోజు. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం భారీగా పడిపోయింది. మరో వైపు అంతర్జాతీయ మార్కెట్ ‌లో మాత్రం బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి,.


హైదరాబాద్ మార్కెట్ లో బంగారం విషయానికొస్తే.. మార్కెట్‌లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.430 పెరుగుదలతో రూ.52,360కు చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ.390 పైకి కదిలింది. దీంతో ధర రూ.48,000కు చేరింది..నిన్న మొన్నటి దాకా వెండి ధరలు జోరు మీదున్న సంగతి తెలిసిందే.. ఈరోజు మాత్రం భారీగా పతనమయ్యాయి.. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,100 పడిపోయింది. దీంతో వెండి ధర రూ.64,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం తో రేట్లు తగ్గాయని నిపుణులు అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: