మగువలకు బ్యాడ్ న్యూస్.. పెరిగిన బంగారం, వెండి ధరలు..!

Satvika
బంగారం కొనాలని భావించె వారికి ఈరోజు షాకింగ్ న్యూస్.. నిన్నటి ధరలతో పోలిస్తే..ఈరోజు ధరలు ఇంకాస్త పైకి కదిలాయి...దేశంలో వరుసగా రెండో రోజు పసిడి ధరలు పెరిగాయి. శుక్రవారం తులం బంగారంపై 430 వరకు పెరగ్గా.. ఈరోజు మరో రూ.250 మేర పెరిగింది. ఇక వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. తాజాగా కిలో వెండిపై రూ. 350 వరకు పెరిగింది. కాగా అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరి శనివారం (జూన్‌ 17)న దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..


నేడు ప్రధాన మార్కెట్ లో ధరలు ఎలా ఉన్నాయో చుద్దాము..హైదరాబాద్‌ లో 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,750గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,120 పలుకుతోంది. విజయవాడ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది. విశాఖపట్నం లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 పలుకుతుండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 వద్ద ఉంది. చెన్నై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52, 180పలుకుతోంది.


ముంబై లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,750ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,100 వద్ద కొనసాగుతోంది. ఢిల్లీ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,780గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,120పలుకుతోంది.కోల్‌కతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,440 వద్ద ఉంది. బెంగళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,780గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,120 పలుకుతోంది. కేరళ లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,100 వద్ద ఉంది..వెండి ధరలు వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.66,000గా ఉంది. ఇక విజయవాడ, విశాఖ, చెన్నై నగరాల్లోనూ ఇదే ధర వద్ద వెండి కొనసాగుతోంది. ముంబైలో రూ.61,500, ఢిల్లీలో రూ.61,500, కోల్‌కతాలో రూ.61,500 బెంగళూరులో రూ.66,000, కేరళలో రూ.66,000 పలుకుతున్నాయి...మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: