మగువలకు షాక్ ఇస్తున్న బంగారం, వెండి ధరలు..!

Satvika
బంగారం కొనాలని అనుకొనే మహిళలకు భారీ షాక్.. ఈరోజు బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి..నిన్న స్వల్పంగ పెరిగిన ధరలు ఈరోజు మాత్రం దూసుకుపోతున్నాయి.దీంతో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850కి చేరగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధరలు రూ. 52,200కు చేరాయి. మరోవైపు వైపు వెండి కూడా బంగారం బాటలోనే నడుస్తోంది. నిన్నటి వరకు స్థిరంగా ఉన్న సిల్వర్ రేట్స్ సైతం మంగళవారం స్వల్పంగా పెరిగాయి.మరోవైపు అంతర్జాతీయ మార్కెట్ లో కూడా ధరలు పెరిగాయని తెలుస్తుంది.


ఈరోజు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చుద్దాము..హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200 ఉంది.. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,950 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,310కు చేరింది. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200కు చేరింది.

 
ఇక ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 52,200కు చేరింది. విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 47,850 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 52,200 ఉంది..అదే విధంగా వెండి ధరలు మాత్రం ఈరోజు స్వల్పంగా పెరిగాయి..ఈరోజు మార్కెట్ లో చెన్నైలో కేజీ సిల్వర్ రేట్ రూ. 67,000 ఉండగా.. ముంబైలో రూ. 62,500కు చేరింది. అలాగే ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 62,500 ఉండగా.. బెంగుళూరులో కేజీ సిల్వర్ రూ. 67000కు చేరింది.మిగిలిన అన్నీ రాష్ట్రాలలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.మరి రేపు మార్కెట్ లో ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: