కొత్త వేరియంట్‌ ఎఫెక్ట్... బంగారం ధరలకు రెక్కలు

Vimalatha
భారతదేశంలో బంగారం ధరలు ఈరోజు అంటే నవంబర్ 27న అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా రూ. 310 / 10 గ్రాములు పెరిగింది. కొత్త కోవిడ్ వేరియంట్ ఆందోళనల కారణంగా ప్రపంచ మార్కెట్‌లలో పెరిగాయి. ఈరోజు భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధరలు రూ. 46,940/10 గ్రాములుగా, 24 క్యారెట్ల బంగారం ధరలు రూ. 47,940/10 గ్రాములుగా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా వంటి చాలా నగరాల్లో బంగారం ధరలు నేడు రూ.150/10 గ్రాముల వరకు పెరిగింది. అహ్మదాబాద్, చెన్నైలలో అయితే బంగారం ధరలు ఏకంగా నేడు రూ. 460/10 గ్రాములకు చేరుకున్నాయి.
ఈ రోజు కామెక్స్ గోల్డ్ డిసెంబర్ ఫ్యూచర్స్ 1.47% లాభపడి $1810.5/oz వద్దకు చేరుకున్నాయి. అయితే స్పాట్ గోల్డ్ ధరలు 1.52% తగ్గి చివరిగా ట్రేడ్ అయ్యే వరకు $1816.5/oz వరకు కోట్ అయ్యాయి. నిన్న కామెక్స్ డిసెంబర్ గోల్డ్ ఫ్యూచర్స్ $1784.3/oz దగ్గర ముగిసింది. మరోవైపు స్పాట్ మార్కెట్లో US డాలర్ ఇండెక్స్ 0.54% పడిపోయి, 96.25 వద్ద ఉంది. అదే గ్లోబల్ గోల్డ్ రేట్ ఎఫెక్ట్ తో భారతదేశంలో అక్టోబర్ ఫ్యూచర్‌లో ముంబై MCX బంగారం ధర రూ. 48,200/10 గ్రాములకు చేరుకొని, చివరి ట్రేడింగ్ వరకు 1.64% లాభపడింది.
దక్షిణాఫ్రికాలో B.1.1.529 అనే కోవిడ్ యొక్క కొత్త వేరియంట్‌ని రాత్రికి రాత్రే గుర్తించినందున గ్లోబల్ మార్కెట్‌లలో బంగారం ధరలు ఈరోజు 1.50% కంటే ఎక్కువ పెరిగాయి. కొత్త వేరియంట్ అంటే మళ్లీ ఈక్విటీ మార్కెట్లు ప్రభావితమవుతాయి. ఆర్థిక వ్యవస్థలలో డిమాండ్-సరఫరా వ్యవస్థ ప్రభావితమవుతుంది. మహమ్మారి మొదటి వేవ్, రెండవ వేవ్ సమయంలో ఇదే జరిగింది. పెట్టుబడిదారులు ఈసారి కూడా ఇదే పరిస్థితిని ఆశిస్తున్నారు. డెల్టా వేరియంట్ ఆర్థిక వ్యవస్థను ప్రతికూలంగా ప్రభావితం చేసింది. డెల్టా వేరియంట్‌కు వ్యతిరేకంగా అందుబాటులో ఉన్న వ్యాక్సిన్‌లు తగినంత ప్రభావవంతంగా లేవు. B.1.1.529 అనేది ఒక కొత్త వేరియంట్. శాస్త్రవేత్తలు ఈ వేరియంట్ పై పరిశోధనలు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: