IRMA: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు!

Purushottham Vinay
ఇక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్‌మెంట్ ఆనంద్ (IRMA) సంస్థ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ని విడుదల చేసింది.ఇంకా అలాగే గ్రామీణాభివృద్ధి నిర్వహణలో భాగంగా..ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.అర్హత విషయానికి వస్తే..ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులకు..పదో తరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణత సాధించాలి. ఇంకా దీనితో పాటు.. ప్రాథమిక ఇంగ్లీష్ అండ్ హిందీ చదవే సామర్థ్యం కూడా ఉండాలి. ఇంకా విద్యా సంస్థలో ఇదే హోదాలో రెండు నుంచి మూడు సంవత్సరాల పాటు పని అనుభవం కూడా ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి 31 జూలై, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.ఇంకా రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు..ఆర్థిక శాస్త్రంలో ఖచ్చితంగా పోస్ట్-గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి. ఇంకా సామాజిక శాస్త్ర రంగంలో పని అనుభవం ఉండాలి.అలాగే ప్రాథమిక ఎకనామెట్రిక్ నైపుణ్యాలతో పాటు.. గణాంక సాఫ్ట్‌వేర్ ప్యాకేజీలలో కూడా అనుభవం ఉండాలి. ఇంకా ఇంగ్లీష్ లో మౌఖిక అండ్ రాత పరీక్షలో కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. ఈ పోస్టుల దరఖాస్తుకు చివరి తేదీ వచ్చేసి 22జూలై, 2022గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.


వయస్సు విషయానికి వస్తే..ఆఫీస్ అసిస్టెంట్ ఇంకా రీసెర్చ్ / కన్సల్టింగ్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.ఇంకా అలాగే అసిస్టెంట్ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు 3 సంవత్సరాలు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఎంపిక చేయనున్నారు.అలాగే జీతం విషయానికి వస్తే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు రూ.10 వేల నుంచి రూ. 12 వేల మధ్య జీతం చెల్లించనున్నారు. రీసెర్చ్  ఇంకా కన్సల్టింగ్ పోస్టులకు రూ.37 వేలు జీతం చెల్లించనున్నారు. ఇక 2 సంవత్సరాల కాంట్రాక్ట్ బేసిస్ మీద ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అలాగే ఈ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు 6 నెలలు ప్రొబిషన్ పిరియడ్ లో చేయాల్సి ఉంటుంది.ఇక వీటికి మొదట అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలి. తరువాత దీనిలో రిజిస్ట్రేషన్ ఆప్షన్ ను ఎంచుకొని దానిలో ఈమెయిల్,పాస్ వర్డ్ లను క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.ఆ తరువాత మెయిన్ వెబ్ సైట్ కు వెళ్లి.. లాగిన్ ఆప్షన్ ను ఎంచుకొని దరఖాస్తును సమర్పించాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: