టెన్త్ అర్హతతో పోస్టల్ శాఖ నుండి మరో నోటిఫికేషన్!

Purushottham Vinay
ఇక పోస్టల్ శాఖలో గ్రూప్-సి ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల అయింది.ఇక దీనికి అర్హత విషయానికి వస్తే కేవలం 10వ తరగతి పాసై ఉంటే చాలు..పోస్టల్ శాఖ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ స్టాఫ్ కార్ డ్రైవర్ పోస్టులకు భారీ స్థాయిలో వేతనాలు లభించనున్నాయి. ఇందులో భాగంగా స్టోర్ కీపర్ ఇంకా మల్టీ స్కిల్డ్ వర్కర్ పోస్టులను కూడా భర్తీ చేయనున్నారు. స్త్రీ ఇంకా పురుష అభ్యర్థులందరూ ఆన్ లైన్ విధానం ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర సంస్థ కాబట్టి ఏపి ఇంకా అలాగే టీఎస్ వారిద్దరిద్దరూ కూడా అప్లై చేసుకొనే మరో మంచి అవకాశం.ఇక రాతపరీక్ష నిర్వహించడం ద్వారా దీని ఎంపిక ఉంటుంది కాబట్టి ఆసక్తి ఉన్నటువంటి అభ్యర్థులు క్రింద సమాచారాన్ని పూర్తిగా చదివి దరఖాస్తు చేసుకోగలరు..అయితే 27 ఏళ్ల వయస్సు మించరాదు, SC,ST వారికి - 5 సంవత్సరాలు ఇంకా OBC వారికి - 3 సంవత్సరాలు వయస్సులో సడలింపు కల్పించారు.విద్యార్హతల విషయానికి వస్తే..గుర్తింపు పొందిన బోర్డు నుండి ఖచ్చితంగా పదో తరగతి అర్హత కలిగి ఉండాలి. లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి.ఇంకా అలాగే మోటార్ మెకానిజమ్ మీద అవగాహన ఉండాలి.దరఖాస్తు విధానం విషయానికి వస్తే.. ఇక అభ్యర్థులు ఆఫ్ లైన్ విధానం ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా అధికారిక వెబ్ సైట్ నుండి లేదా క్రింది అప్లికేషన్ ఫార్మ్ అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు పత్రమును డౌన్లోడ్ చేసుకోండి.తరువాత నోటిఫికేషన్ నందు పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.ఇక అవసరమైతే, దరఖాస్తు రుసుము కూడా చెల్లించండి.ఇంకా అభ్యర్థులు అప్లికేషన్ పత్రమును నింపిన తరువాత, ఇక సమర్పించబోయే ముందు ఒకటికి రెండు సార్లు సరిచూసుకోని క్రింది చిరునామాకు పంపించండి.అలాగే
దరఖాస్తు ఫీజు విషయానికి వస్తే..జనరల్ ఇంకా ఓబీసీ అభ్యర్థులు - రూ 100/- ఇంకా అలాగే మిగితా అభ్యర్ధులకి ఎటువంటి ఫీజు లేదు. ఇంకా దరఖాస్తు ప్రారంభ తేదీ జూన్ 10, 2022 అలాగే దరఖాస్తు చివరి తేదీ జులై 11, 2022. దీనికి ఎంపిక విధానం విషయానికి వస్తే..వ్రాత పరీక్ష (మోటార్ మెకానిజం, ట్రాఫిక్ రూల్స్, సిగ్నల్స్ ఇంకా రెగ్యులేషన్ గురించిన 80 మార్కుల పేపర్ ఉంటుంది).ఇంకా ప్రాక్టికల్ టెస్ట్-I (80 మార్కుల ప్రాక్టికల్ టెస్ట్ ఆఫ్ డ్రైవింగ్).తరువాత ప్రాక్టికల్ టెస్ట్-II (60 మార్కుల డ్రైవింగ్ టెస్ట్)ఉంటుంది.ఫైనల్ గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇంకా వైద్య పరీక్ష వుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: