మార్పులకు సన్నద్ధం కావాలి : మైక్రోసాఫ్ట్

మార్పులకు సన్నద్ధం కావాలి మైక్రోసాఫ్ట్
ప్రపంచంలో చాలా మర్పులు వస్తున్నాయని వాటికి విద్యార్ధులు సన్నద్ధం కావాలని మైక్రోసాఫ్ట్ ఇండియా డైరెక్టర్ మయూరికా సింగ్ పిలుపునిచ్చారు. కష్టపడితే నే విజయం సొంత మవుతుందని చెప్పారు.  సాంకేతికత అందుబాటులోకి వచ్చిన ఈ రోజుల్లో విజ్ఞానం విరివిగా లభిస్తున్నదని పేర్కొన్నారు. కొత్త అవకాశాలను వెతుక్కోవడం, వాటిని అందిపుచ్చుకోవడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. విట్ ఆంధ్ర ప్రదేశ్  విశ్వవిద్యాలంయం స్నాతకోత్సవం వర్చవల్ విధానంలో జరిగింది. ఈ కార్యక్రమంలో నోబెల్ బహుమతి గ్రహీత స్టాన్ లీ విట్టింగ్ హామ్ తో సహా పలువురు ప్రముఖలు ప్రసంగించారు. విద్యార్ధులకు దిశానిర్దేశం చేశారు. 2017 బ్యాచ్ కు చెందిన 460 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలను అందించారు.


సైన్స్ కు ఆకాశమే హద్దని, ఎల్లలు లేవని నోబెల్ బహుమతి గ్రహీత స్టాన్ లీ విట్టింగ్ హామ్  పేర్కొన్నారు. విశ్వ విఖాతమైన శాస్త్ర విజ్ఞానాన్ని అందరూ అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. కోవిడ్-19లాంటి మహమ్మారిని ఎదుర్కోనేందుకు  సైన్స్ ఎంతో అవసరమైందన్నారు. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులు మానవాళికి  హానికలిగించే విధంగా ఉన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భూతాపాలను పరిష్కరించే దిశగా కొత్త  ఆవిష్కరణలు రావాల్సిన అవసంరం ఎంతైనా ఉందని చెప్పారు. ఆ దిశగా విద్యార్ధలు  ఆలోచనలు చేయాలని కోరారు. జీవితంలో ఎన్నో అవరోధాలు ఎదురవుతుంటాయని చెప్పారు. వాటిని కాలానికి అనుగుణంగా ఎంతో సంయమనంతో ఎదుర్కోవాలని తెలిపారు. సవాళ్లను ఎదుర్కోవడంలో నేర్పును ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు.  విద్యార్ధలు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలని, అందుకోసం ప్రపంచ మంతా తిరగాలని చెప్పారు. మంచి మంచి కలలు  కనండి, వాటిని సహకారం చేసుకునేందుకు కృషి చేయండి అని స్టాన్ లీ విట్టింగ్ హామ్  పిలుపునిచ్చారు. విట్ ఆంధ్ర ప్రదేశ్ విశ్వ విద్యాలయం ఐ కేర్  ర్యాంకింగ్స్ లో భారత దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని విట్  కులపతి విశ్వనాథన్ పేర్కొన్నారు.|

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: