50లక్షలకో.. మెడికల్ సీటు..

విద్య వ్యాపారం అయినప్పటి నుండి ఆ రంగంలో స్కాంలు విపరీతంగా జరుగుతున్నాయి. ఆయా సంస్థలు తమ ఆధిపత్యం కోసం విద్యావ్యవస్థను అడ్డుపెట్టుకుంటూ ప్రశ్నపత్రాలు ముందే తెలుసుకుంటున్నారు. మరి కొన్ని సంస్థలు విద్యార్థుల చదువుకోవాలనే ఆశను అడ్డుపెట్టుకొని సీట్లను ఇష్టానికి అమ్ముకుంటూ ఉన్నారు. దీనివలన విద్య ద్వారా జ్ఞానం సముపార్జించి తద్వారా దేశానికి మేలు చేయాలనే నిజమైన లక్ష్యం ఉన్న విద్యార్థులకు విద్య అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది. అలాగే అర్హత లేనివారు వ్యవస్థలలో భాగమై పోతున్నారు. దీనితో ఆయా వ్యవస్థలు నాణ్యత లేక నిర్వీర్యం అవుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు కూడా దీనిపై స్పందిస్తున్నప్పటికీ ఏ పార్టీ కూడా తగినవిధంగా చర్యలు చేపట్టలేకపోయిందనే చెప్పాలి. అందులో వారివారి స్వప్రయోజనాలే ఎక్కువ ఉండటం ప్రధాన కారణం.
నాణ్యత లేని వ్యవస్థలు తయారవడం దేశానికి మంచిది కాదనేది విశ్లేషకుల సూచన, అయినప్పటికీ విద్యా రంగంలో చెప్పుకోదగ్గ మార్పులు రావడం లేదు. ఒకవేళ ఒత్తిడి తట్టుకోలేక ఆయా ప్రభుత్వాలు ఏమైనా చేసిన అది కేవలం తాత్కాలికంగా కంటితుడుపు చర్యలుగానే మిగిలిపోతున్నాయి. దీనితో విద్యను వ్యాపారం చేసిన సంస్థలు రెచ్చిపోతున్నాయి. రోజురోజుకు ఈ వ్యవస్థ లో నాణ్యతా పరిమాణాలు క్షిణించిపోతున్నాయి. ఇక్కడ విద్య పూర్తిచేసుకొని ఆయా వ్యవస్థలలో ఉద్యోగాలు చేస్తున్న వారు నాణ్యత లేని వారు కావడంతో అవి కూడా నిర్వీర్యం అయిపోతున్నాయి. వీళ్ళను వ్యవస్థలలో చొరబడకుండా చర్యలు కొన్ని సంస్థలు తీసుకున్నప్పటికీ, వాటిలో కూడా లోపాలు తెలుసుకొని వాటిలో వీళ్లు వ్యవస్థలలో చేరుతున్నారు.
తాజాగా నీట్ పరీక్ష కోసం తర్ఫీదు ఇస్తున్న నాగాలాండ్ లోని ఒక విద్యా సంస్థ 50 లక్షలు తీసుకోని విద్యార్థుల పరీక్షలు తామే రాసేట్టు అగ్రిమెంట్ చేసుకొని దాని ప్రకారం సీట్లు కూడా కేటాయిస్తుండటం జరుగుతుంది. సిబిఐ ఈ విషయంపై విచారణ చేస్తుంది. సిబిఐ ప్రకారం సదరు ఇన్స్టిట్యూట్ విద్యార్థుల నుండి భారీగా నగదు వసూలు చేసి నకిలీ వారితో నీట్ పరీక్ష రాపిస్తున్నారు. అలాగే నగదు ఇచ్చిన  వారికి స్థానిక ప్రభుత్వ కళాశాలలలో సీట్లు కూడా ఇప్పిస్తున్నారు. తాజా నీట్ పరీక్ష లో కూడా ఇలాంటి స్కాం చేయాలని చూసిన ఈ సంస్థ ప్రయత్నాన్ని సిబిఐ ముందుగా తెలుసుకొని నిలువరించింది. దాదాపు ఐదు కేంద్రాలలో ఇటువంటి ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తుంది. ఈ విషయం సిబిఐ కి తెలియడంతో సదరు అధికారులు మరియు విద్యార్థులను విచారిస్తున్నారు. అందుకే తాజాగా కొందరు నీట్ పరీక్ష అనంతరం అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: