గురజాడను స్మరించారు.

గురజాడను స్మరించారు.
దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన ప్రముఖ రచయిత,సంఘ సంస్కర్త గురజాడ అప్పారావును విద్యావేత్తలు, విద్యార్దులు  స్మరించారు. ఎన్నో ఉద్యమాలకు పుట్టినిల్లయిన నెల్లూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణం లోగల  పొట్టి శ్రీ రాముల భవనం ఈ కార్యక్రమానికి వేదికైంది.  గురజాడ వెంకట అప్పారావు జయంతి  నిర్వహించారు.  రెక్టార్ ఆచార్య ఎం.చంద్రయ్య , రిజిస్ట్రార్ డా.ఎల్.విజయ కృష్ణారెడ్డి  గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.

 ఈ సందర్భంగా రె క్టార్ ఆచార్య ఎం.చంద్రయ్య  మాట్లాడుతూ గురజాడ అప్పారావు  తన రచనల ద్వార,నాటకాల ద్వారా సమాజంలో వున్నా దురాచారాలని ఎలుగెత్తి చాటారు. ఆ దురాచారాల వలన ప్రజలు ఎంత నష్టం అనుభవిస్తున్నారో ఎంత బాధ పడుతున్నారో అందరికి అర్ధం అయ్యే సరళమైన భాషలో ఆయన  చెప్పారన్నారు. ఇప్పటికి కూడా బాల్యవివాహాలు, మాతంగి వ్యవస్థలు అక్కడక్కడ జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి దురాచారాల పైన పోరాడిన గురజాడ అప్పారావు మనకి ఆదర్శం అని పేర్కొన్నారు. విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం లో ఇటువంటి మహనీయులని జ్ఞాపకం చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం చాల మంచి విషయం అని తెలిపారు. 

విశ్వవిద్యాలయ రిజిస్త్రార్ .ఎల్.విజయ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ మహనీయులు చెప్పిన మాటలను ఆచరించిన విధానాలను మనం అనుసరించాలని పిలుపునిచ్చారు.  గురజాడ అప్పావు 100 సవంత్సరాలు క్రితం చెప్పిన మాటలను ఇప్పటికి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉందన్నారు. వాటిల్లో కన్యాశుల్కం అనే నాటకం ద్వారా సామాన్య ప్రజలకు అంటే చదువు రాని పామరులకి కూడా అర్ధం అయ్యే విధంగా ఈ కన్యశుల్కం నాటకాన్ని రచించారు. కన్యాశుల్కం ద్వార బాల్య వివాహాలను ,ఆరోజుల్లో వున్న సమస్యలను ,సామజిక రుగ్మతులను ఆయన ప్రతిఘటించారు అని చెప్పారు.

 దాదాపు 15 సంవత్సరాలు క్రితం ప్రభుత్వం బాల్య వివాహాల మీద రఘువోత్తమ రావు ఏకసభ్య కమిషన్ నియమించిందని, నివేదికలో దిగ్బ్రాంతి కలిగించే విషయాలను పొందుపరిచారని చెప్పారు.ఇప్పటికీ ఊర్లలో వుండే కొంత మంది మూర్ఖులు బాల్య వివాహాలను, దేవుడి పేరు చెప్పి మాతంగులను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.గురజాడ అప్పారావు లాంటి మహనీయులను మనం అప్పుడప్పుడు స్మరించుకుంటే కనీసం అటువంటి సమస్యల పైన స్పందించటానికి బాగుంటుంది అని తెలిపారు. ఈ కార్యక్రమములో పరరీక్షల నియంత్రణ అధికారి సాయి ప్రసాద్ రెడ్డి, సూపరింటెండెంట్ రామకృష్ణ, మోహిని,స్వాతి, కిరణ్మయి,స్రవంతి,సాగర్,సుధారాణి, తెలుగు శాఖ అధిపతులు రాజారామ్,లక్ష్మినారయణ, విమల తో పాటు బోధన, బోధనేతర సిబ్బంది,విద్యార్ధిని,విద్యార్ధులు  పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: