నిరుద్యోగులకు శుభవార్త.. ఇండియన్ నేవీ రిక్రూట్మెంట్..

Purushottham Vinay
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది, ఇక్కడ షార్ట్ సర్వీస్ కమిషన్ (ఎస్‌ఎస్‌సి) ఆఫీసర్‌ల పోస్టుల కోసం ఖాళీలను భర్తీ చేస్తుంది. ఆసక్తి ఇంకా అర్హత ఉన్న అభ్యర్థులు ఇండియన్ నేవీ యొక్క అధికారిక వెబ్‌సైట్ joinindiannavy.gov.in లో దరఖాస్తు చేసుకోని అప్లికేషన్ ఫారమ్‌లను పూరించగలరు.అభ్యర్థులు తప్పనిసరిగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటే వారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌లను పూరించాల్సి ఉంటుంది. ఈ పోస్టులకు సంబంధించిన కోర్సులు జూన్ 2022 నుండి ఇండియన్ నేవల్ అకాడెమిక్ (INA) ఎజిమాలా, కేరళలో ప్రారంభమవుతాయి. భారత నౌకాదళంలోని పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవడానికి మీకు ఆసక్తి ఉంటే కింద పేర్కొన్న ముఖ్యమైన సమాచారాన్ని చూడండి.
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2021:
ముఖ్యమైన తేదీలు నియామక నోటిఫికేషన్ తేదీ- సెప్టెంబర్ 9
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ- సెప్టెంబర్ 18, 2021
ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ- అక్టోబర్ 5, 2021
కోర్సు ప్రారంభం- జూన్ 2022
ఇండియన్ నేవీ రిక్రూట్‌మెంట్ 2021:
ఖాళీల వివరాలు
జనరల్ సర్వీస్ [GS (X)] /హైడ్రో కేడర్- 45 పోస్టులు
ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ (ATC)- 4 పోస్టులు
అబ్జర్వర్ - 8 పోస్టులు
పైలట్- 15 పోస్టులు
లాజిస్టిక్స్- 18 పోస్టులు
ఎడ్యుకేషన్- 18 పోస్టులు
ఇంజనీరింగ్ బ్రాంచ్ [జనరల్ సర్వీస్ (GS)]- 27 పోస్టులు
ఎలక్ట్రికల్ బ్రాంచ్ [జనరల్ సర్వీస్ (GS)]- 34 పోస్టులు
నావల్ ఆర్కిటెక్ట్ (NA)- 12 పోస్టులు
మొత్తం పోస్టులు- 181
ఈ పోస్టులకు పెళ్లికాని పురుషులు మరియు మహిళలు మాత్రమే అర్హులు. భారతదేశంలో కేంద్ర లేదా రాష్ట్ర శాసనసభ చట్టం లేదా పార్లమెంట్ చట్టం ద్వారా స్థాపించబడిన ఇతర విద్యాసంస్థల ద్వారా ఒక విశ్వవిద్యాలయం నుండి మొత్తం లేదా సమానమైన CGPA లో కనీసం 60% మార్కులతో పాసై లేదా చివరి సంవత్సరంలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చుఇక అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఈ పోస్టులకు అప్లై చేసుకోండి. త్వరపడండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: