నిరుద్యోగం .. నివేదిక ..

కరోనా కారణంగా ప్రపంచ దేశాలు ఆర్థికంగా, సామాజికంగా విలవిలా లాడిపోతున్నాయి. కొన్ని దేశాలు ఇప్పటికే దివాళా తీసేస్తే, కొన్ని మాత్రం అందుకు అడుగు దూరంలో ఉన్నాయి. ఇంకొన్ని దేశాలు మాత్రం తమాయించుకొని నిలబడటానికి కృషి చేస్తున్నాయి. అయితే ఈ కరోనా వలన అన్ని రంగాలు కుదేలు కాలేదు, వైద్యరంగం సహా అనేక ఉపరంగాలు సరికొత్త ఉపాధులను కూడా పొందాయి. కొత్త మందుల ఉత్పత్తి, కరోనా సంబంధిత అనేక ఔషదాల తయారీదారులు, మాస్కులు గట్రా తయారీ దారులు, వాక్సినేషన్ తదితర రంగాలు మాత్రం బాగానే పుంజుకున్నాయి. వైద్యేతర రంగాలు మాత్రం కాస్త వెనకపడ్డాయి అనే చెప్పాల్సి ఉంది.
దీనితో చాలా సంస్థలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటూనే వస్తున్నాయి. నైపుణ్యం ఉన్న వారితో ఎక్కువ పని చేయించుకుంటూ నెట్టుకొస్తున్నాయి. కరోనా ముందే అడుగులు వేయడం మొదలుపెట్టిన సంస్థలు పూర్తిగా ఆగిపోకుండా ప్రభుత్వాలు కూడా వాటికి ఉద్దీపనలు ఇచ్చి కాస్త ఊరటనిచ్చాయి. ఎన్ని చేసినా నిరుద్యోగం మాత్రం పెరిగిపోయిన మాట మాత్రం స్పష్టం. తాజాగా విడుదలైన నివేదికలు కూడా ఇదే స్పష్టం చేశాయి. ఒక్కసారిగా నిరుద్యోగం రెట్టింపైంది అని ఈ నివేదికలు చెపుతున్నాయి. అన్నిటికీ ప్రభుత్వాల పై నిందలు వేయకపోయినా, కరోనా ముందు ప్రభుత్వాలు చేసిన కొన్ని నిర్ణయాలు ఈ సమయంలో చాలా పెద్ద దెబ్బె కొట్టాయని చెప్పాలి.
గత ఏడాదిలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగం పెరిగి 10.3 శాతంగా ఉందని నివేదికలు తెలిపాయి. దీనికి ముందు ఈ సంఖ్య 7.8 గా ఉండేది. లాక్ డౌన్ సమయంలో ఈ నిరుద్యోగం సరాసరి 20.8 గా నమోదైనట్టు నివేదిక స్పష్టం చేసింది. అనంతరం పరిణామాలతో 13.2 శాతానికి తగ్గింది. విద్య, రవాణా, పర్యాటక రంగాలలో ఈ ప్రభావం బాగా ఉందని తెలుస్తుంది. పోయిన ఏడాది డిసెంబర్ లో అత్యధికంగా 24.9 శాతానికి చేరడం అందరిని విస్మయానికి గురిచేసింది. ఏది ఏమైనా ఇప్పటికి నిరుద్యోగం పదిశాతం దాటటం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నివేదికలను 2017 నుండి తయారుచేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: