కరోనా లో కూడా .. జిగేల్ జీతాలు ..

కరోనా సంక్షోభం నిరుద్యోగాన్ని పెంచిపోషిస్తుంది. ఇప్పటికే దీని ప్రభావంతో ఎన్నో దేశాలు దివాళా స్థితికి వచ్చేశాయి. మరికొన్ని తమ ఉనికిని నిలుపుకోడానికి తాపత్రయ పడుతున్నాయి. ఈ సంక్షోభంలో దేశాల పరిస్థితే ఇలా ఉంటె, ఇంకా సంస్థల పరిస్థితి గురించి చెప్పాల్సిన పనే లేదు. కానీ ఇవాళ రేపు దాదాపు ప్రపంచం నిండా కార్పొరేట్ సంస్థలే కాబట్టి, వాటికి డబ్బు రాబట్టుకోవడం, దాచుకోవడం తప్ప మరి ఏ ఇతర లక్ష్యాలు ఉండవు. అలాంటి సంస్థలు ఈ సంక్షోభాన్ని ఒప్పుకుంటాయా అంటే కాదనే చెప్పాలి. దానికోసం ఏమైనా చేయడానికి సిద్ధం అవుతాయి ఈ సంస్థలు.
అందుకే ఉద్యోగుల సంఖ్యను వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయి సంస్థలు. తద్వారా నిర్వహణ భారాన్ని తగ్గించుకోవటం వారి ప్రణాళిక. అలాగే ఉన్న వారితోనే తమ పనులు చేపించుకోవాలి కాబట్టి వారిలో అందుకు అర్హులెవరో ముందస్తు విచారణ చేసుకొని దానిప్రకారం అనవసరం అనుకున్న ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. కరోనా ముందు వరకు ఏదో కాస్త పనితనం ఉన్న వారందరికీ కాస్త శిక్షణ ఇచ్చి తమ పని చేయించుకున్న సంస్థలు ఇప్పుడు ఆ రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేవు. పూర్తి నైపుణ్యం ఉన్న వారిని ఏరికోరి ఎంచుకుంటున్నాయి.  
ఇలా ఎంచుకున్న వారికి ఇచ్చే జీతాల గురించి కూడా పెద్దగా ఆలోచించడం లేదు. ఒకవేళ ఇలాంటి వారికి జీతాలు ఇవ్వడం కష్టం అనుకుంటూ వీరిని ఉంచి, మిగిలిన వారిని మళ్ళీ ఫిల్టర్ చేసి అనవసరం అనుకుంటే బయటకు తోలేస్తున్నారు. చాలా సంస్థలు ఈ సీజన్(కరోనా పాండమిక్) లో కూడా నైపుణ్యం ఉన్న వారికి జీతాలు ఎంతైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. కాస్తోకూస్తో పని చేసే వారిని ఎంతమందినైనా నిర్దాక్షిణ్యంగా తీసేసి, వీరికి స్వాగతం పలుకుతున్నాయి ఆయా సంస్థలు. తాజాగా జరిగిన సర్వే లో చాలా సంస్థలు ఇదే బాటను ఎంచుకుంటున్నట్టు తేలింది. కనుక ఉద్యోగార్థులారా, విద్యార్థులారా నైపుణ్యం మీ పెట్టుబడి అయితేనే భవిష్యత్తులో ఉద్యోగాలు మీ సొంతం, లేదంటే అంతే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: