ఉద్యోగుల కోసం .. వలతో సంస్థలు ..

సాధారణంగా సంక్షోభం లో ఉద్యోగాలు ఊడిపోతుండటం చూస్తుంటాం. ఎందుకంటే అప్పటి స్థితిలో సంస్థలు తమ నిర్వహణ ఖర్చు తగ్గించుకోడానికి తమతమ మానవ వనరులను వీలైనంత తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. తద్వారా ఆయా ఉద్యోగులకు ఉద్వాసన తప్పదు. అదే సమయంలో ఉన్న కొద్ది మందిపై పనిభారం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎవరు ఈ భారాన్ని భరించి వారివారి బాధ్యతలను చక్కగా నిర్వర్తించగలరు అనే పరిశోధన జరిపిన అనంతరం మిగిలిన వారి ఉద్వాసన కు సిద్ధం అవుతుంది సంస్థ. నిర్వహణలో ఇదో రకం, సంక్షోభంలో ఎవరికైన ఇది తప్పని పరిస్థితి.
ఒక్కసారి సంక్షోభం వస్తే, సంస్థలు చేసే మొదటి పని ఇదే. దీనితో నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, ఇది సంక్షోభంలో సాధారణంగా ఉండేదే. చాలా సంస్థలు ఈ తరహా సమస్యలు ఎదుర్కొన్నవే, ఇటువంటి సందర్భాలు చిన్న సంస్థలు ప్రాథమిక స్థాయిలోనే చూస్తుంటాయి. అందుకే అవి తమ నిర్వహణ  ఖర్చు పై, సంస్థ ఒక స్థాయికి వచ్చింది అనే నమ్మకం కలిగేదాకా, దాదాపు ద్రుష్టి పెడతారు. ఒక్క సారి ఆ లైన్ దాటిన తరువాత అందరు సమానమే. పెద్దదైన, చిన్నదైనా సంస్థలు సంక్షోభంలో తీసుకునే నిర్ణయాలు ఒకేవిధంగా ఉంటాయి. కాకపోతే పెద్దవాళ్ళు కాస్త వెనుక, చిన్న సంస్థలు కాస్త ముందు ఉంటాయి అంతే.
ఇక కొన్ని సంస్థలు సంక్షోభంలో ఉద్యోగులకు ఉద్వాసన పలకడంతో పాటుగా, తమ అవసరాల మేరకు అంటే అప్పటి ఒత్తిడిని తట్టుకుని ముందడుగు వేయగలిగే ఉద్యోగుల కోసం వెతుకుతూ ఉంటారు కూడా, ఆ వెతుకులాటలో నియామకాలు తప్పవు మరి. కాస్త ఎక్కువైనా ఇచ్చి మరీ వేరే సంస్థ నుండి ఆయా ఉద్యోగులను తెచ్చేసుకుంటాయి. తద్వారా నిర్వహణ తమకు అనుకూలంగా ఉంటుంది, అలాగే పనిలో నాణ్యతా ఉంటుంది అనేది వారి ప్రణాళిక. అందుకే సంక్షోభంలో కూడా నైపుణ్యం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది. ఇటువంటి వారికోసం సంస్థలు వెతుక్కుంటూ వస్తాయి, జీతాలు ఎంతైనా ఇస్తాయి. వారి అవసరం అలాంటిది మరి. అందుకే సంక్షోభం ఇంటిముందే ఉంది, నైపుణ్యం పెంచుకుంటూ ఎల్లప్పుడూ మీ ఉద్యోగాన్ని కాపాడుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: