సెకండియర్‌ విద్యార్థులు ఫస్టియర్‌ పరీక్షలు రాయాల్సిందే!

N.Hari
తెలంగాణ‌లో ఇప్పుడిప్పుడే విద్యావ్య‌వ‌స్థ మ‌ళ్లీ గాడిన ప‌డుతోంది. క‌రోనా నుంచి కోలుకుంటూ రెండేళ్ల త‌ర్వాత విద్యాసంస్థ‌లు పూర్తిస్థాయిలో తెరుచుకుంటున్నాయి. పాఠ‌శాల, ఇంట‌ర్ విద్య‌కు సంబంధించి అకాడ‌మిక్ క్యాలెండ‌ర్ల‌ను సైతం విద్యాశాఖ విడుద‌ల చేసింది. అయితే వ‌చ్చిన సమస్యల్లా.. ప్ర‌స్తుతం సెకండ్ ఇయ‌ర్ చ‌దువుతున్న విద్యార్థుల‌కు రాబోయే రోజుల్లో మ‌ళ్లి క‌రోనా పెరిగితే ప‌రిస్థితి ఏంట‌నే దానిపై అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్నారు. ప్ర‌స్తుతం సెకండ్ ఇయర్ చ‌దువుతున్న విద్యార్థులు 10వ త‌ర‌వ‌గ‌తిలోనూ ప‌రీక్ష‌లు లేకుండానే పాస్ అయ్యారు. ఫ‌స్ట్ ఇయ‌ర్‌లోనూ ప‌రీక్ష‌లు లేకుండానే ప్ర‌మోట్ అయ్యారు. దీంతో ఇదే ప‌రిస్థితి రాబోయే రోజుల్లో ఏర్ప‌డితే వీళ్ల‌ను ఎలా పాస్ చేయాల‌నే అంశంపై విద్యా శాఖ క‌స‌ర‌త్తు చేసింది. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వీరికి ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్ష‌లు పెడితే ...సెకండ్ ఇయ‌ర్ ప‌రీక్ష‌లు ర‌ద్దు అయినా, ఫ‌స్ట్‌ ఇయ‌ర్ మార్కుల‌తో పాస్ చేయ‌వ‌చ్చ‌ని, అందుకే త‌క్ష‌ణం ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా ఇంట‌ర్ బోర్డ్ స‌న్నాహాలు చేస్తోంది.
సెకండ్ ఇయ‌ర్ విద్యార్థుల‌కు ఫ‌స్ట్ ఇయ‌ర్ పరీక్ష‌లు పెట్టాల‌ని దాదాపు నెల‌రోజుల నుంచి షెడ్యూల్డ్ సన్నద్ధం చేస్తున్నా.. అది అమ‌లు కావడం లేదు. దీంతో విద్యార్థులు సెకండ్ ఇయ‌ర్ సిల‌బ‌స్‌పై పూర్తి స్థాయిలో ఫోక‌స్ చేశారు. అయితే తాజాగా అకాడ‌మిక్ ఇయ‌ర్ షెడ్యూల్డ్‌ను విడుద‌ల చేసిన ఇంట‌ర్ బోర్డ్.. వ‌చ్చే నెల మొద‌టి వారంలో ద‌స‌రా సెల‌వుల‌ కంటే ముందు ప‌రీక్ష‌లు పెట్టాల‌ని, నేడో రేపో షెడ్యూల్డ్ సైతం విడుదల చేయాల‌ని అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు స‌మాచారం. అయితే పెడ‌తారో పెట్ట‌రో ఇప్ప‌టికైనా తేల్చాల‌ని, సెకండ్ ఇయ‌ర్ చ‌ద‌వాలో లేక ఫస్ట్ ఇయ‌ర్ పుస్త‌కాలు తెర‌వాలో అర్థం కావ‌డం లేద‌ని విద్యార్థులు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. ఒకవేళ షెడ్యూల్డ్ ఇచ్చినా క‌నీసం నెల‌రోజుల గ్యాప్ లేక‌పోతే ఎలా ప్రిపేర్ అవుతామ‌ని, ఒక్కో స‌బ్జెక్ట్‌కు మూడు రోజులు స‌మ‌యం స‌రిపోతుందా అంటూ స‌ర్కార్‌ను విద్యార్థులు ప్ర‌శ్నిస్తున్నారు.
మ‌రోవైపు అకాడ‌మిక్ షెడ్యూల్డ్‌ను ప్ర‌క‌టించినా రాబోయే రోజుల్లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో తెలియ‌ద‌ని, అవ‌స‌ర‌మైతే ప‌రీక్ష స‌మాయాన్ని త‌గ్గించి ఆఫ‌న్స్ ఎక్కువ‌గా ఇచ్చి విద్యార్థుల‌తో ప‌రీక్ష‌లు రాయించాల‌ని ఇంట‌ర్ బోర్డ్ క‌స‌ర‌త్తు చేస్తోంది. రేపు లేదా ఎల్లుండి ప‌రీక్ష‌ల షెడ్యూల్డ్ సైతం విడుద‌ల చేసే అవ‌కాశాలున్నాయి. అక్టోబ‌ర్ 4 నుంచి 12 వ‌ర‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించేలా ప్రిప‌రేష‌న్స్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: