స్కూల్స్ ఇన్ని నెలలు మూతపడి ఉండడం భారత్ లోనేనా ..!

MOHAN BABU
ప్రపంచంలో 180 దేశాలలో కరోనా వుంది . విద్య అవసరాన్ని గుర్తించిన ఆయా దేశాలు పాఠశాలలను తెరిచే ఉంచాయి. ఒక వేళా మూసినా ఏదో వారం,పది రోజులు, లేదా నెల అంతే కానీ గంపగుత్తగా 18  నెలలు కాదు .. అది ఒక ఇండియా లోనే జరిగింది . ఇదొక చారిత్రక విషాదంగా చెప్పవచ్చు.. సరే  చివరాఖరికి ప్రభుత్వాలు మేలుకొన్నాయి. పాఠశాలలు తెరవడానికి అనుమతినిచ్చాయి. కానీ విష ప్రచారం రాజ్యమేలుతోంది. పాఠశాలకు పంపితే కరోనా సోకుతుంది . మూడో వేవ్ వస్తుంది  అని రోజూ వండివార్చిన కథనాలు పిల్లల తల్లిదండ్రులను తప్పుదారి పట్టిస్తున్నారు.  పొట్టేలు మటన్ షాప్ వాడినే నమ్మినట్టు మోసపూరిత ప్రచారాన్ని నమ్మి పిల్లలను ఇంటికే పరిమితం చేసిన తల్లితండ్రులకు ఒక మాట చెప్పాలి. విస్స్పష్టంగా చెప్పాలి.
1 . ఆన్లైన్ క్లాసులు చూస్తుంటే తలనొప్పి వస్తుందా అని మీ బిడ్డను అడగండి. మీ బిడ్డనే కాదు. మరో పదిమందిని అడగండి. ఎందుకో తెలుసుకోండి. రేడియేషన్ పిల్లల బ్రెయిన్ పై ఏ స్థాయిలో ప్రభావం చూపుతుందో తెలుసుకోండి. దీని దీర్ఘకాలిక పరిణామాలు ఎలా వుంటాయో తెలుసుకోండి.
2 . మొబైల్ స్క్రీన్ ను అదేపనిగా చూస్తే కళ్ళు ఎలా ప్రభావితం అవుతాయో తెలుసుకోండి.
౩. ఇంట్లో నెలలతరబడి కూర్చుంటే పిల్లల్లో సోషల్ ఇంటలిజెన్స్ కొరవడుతుందని , ఇదే అనేక రకాల మానసిక సమస్యలకు దారి తీస్తోందని తెలుసుకోండి .
4 . పిల్లలు ఆటలకు దూరంగా ఉంటే గ్రోత్ హార్మోన్ వారిలో సరిగా ఉత్పత్తికాదని దీని వల్ల వారి శారీరక ఎదుగుదల కుంటుపడుతుందని తెలుసుకోండి.
5 . మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ కు ఏ స్తాయిలో అడిక్ట్ అయ్యారో  దానిపై వారు ఆడుతున్న వీడియో గేమ్ లు.. ఇంకా చూస్తున్నవి.. దాని పరిణామాలు ఎలా వుంటాయో ఆలోచించండి. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇప్పటికే చాలా నష్టం జరిగింది. ఇంకా మీ పిల్లలను బడికి పంపక పొతే ఎప్పటికీ భర్తీ  చేసుకోలేని నష్టం జరుగుతుంది.  ఈ పోస్ట్ చూసి చాల మందికి కోపం  రావొచ్చు . అసలు సమస్యే కాదనే వారు .. సమస్య వున్నా అంత తీవ్రం కాదనే వారు ఎంతో మంది ఉన్నారు.  గురువుగా ఒక మాట చెబుతాను. కరోనా వల్ల పిలల్లకు ఏమీ కాదు. పిలల్లు మాస్క్ పెట్టుకొంటారా.. ? పెట్టుకొంటే నష్టమా..?  ఇవన్ని చిన్న సమస్యలు .. చిన్న విషయాలు. వారిని ఇంకా బడికి పంపడానికి మీరు ఆలోచిస్తే అది మీ కుటుంబాన్ని , దేశాన్ని నాశనం చేస్తుంది  తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: