గేట్ .. గేట్లు తెరిచారు..

బ్యాచులర్ ఇంజనీరింగ్ వారు గేట్ దరఖాస్తు చేసుకునేందుకు ఘంటికలు మోగాయి. ఈరోజు నుండి వచ్చేనెల 24 (ఆగష్టు 30-సెప్టెంబర్ 24) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి పరీక్ష నిర్వహణ భారం ఐఐటీ ఖరగ్ పూర్ కు అప్పగించారు. ఈ పరీక్ష ద్వారా దేశంలోని ప్రముఖ ఐఐటీ, నిట్ లలో మరియు వివిధ రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయాలలో బ్యాచులర్ ఇంజనీరింగ్ చేసిన వారు మాస్టర్స్ చేయడానికి ప్రవేశం లభిస్తుంది. ఈ పరీక్షలో మంచి ర్యాంక్ తో ఉత్తీర్ణత సాధించిన వారిని ప్రభుత్వసంస్థలు ఉద్యోగాలలో నియమించుకుంటాయి కూడా.
* ఈ పరీక్ష కోసం దరఖాస్తు నిర్ణిత ఆన్ లైన్ ద్వారా చేసుకోవాల్సి ఉంటుంది. దానిని గేట్ ఆన్ లైన్ ప్రాసెసింగ్ సిస్టమ్ అంటారు.
* సెప్టెంబర్ 24 వరకు సాధారణ రుసుముతోను, అనంతరం అక్టోబర్ 1 వరకు అపరాధ రుసుముతోను దరఖాస్తు చేసుకోవచ్చు.
* అక్టోబర్ 1 అనంతరం సదరు దరఖాస్తు లింక్ అందుబాటులో ఉండదు, అంటే ఆలోపే దరఖాస్తు ప్రక్రియ పూర్తిచేయాల్సి ఉంటుంది.
ఫిబ్రవరి 5, 12, 13 తేదీలలో ఈ పరీక్ష నిర్వహణ ఉంటుంది. అయితే అప్పటి కోవిడ్ పరిస్థితులను బట్టి ఈ తేదీలలో మార్పులు ఉండవచ్చని నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ విషయంగా వారు సామజిక మాధ్యమాలలో ఒకటైన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించారు.
ఇక అర్హతల విషయానికి వస్తే, ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఆర్కిటెక్చర్, సైన్స్, కామర్స్, ఆర్ట్స్ విభాగాలలో ఏఐసీటీఈ, యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం బీఈ, బీటెక్, బీఆర్క్, బీప్లానింగ్ లలో ఉత్తీర్ణులై ఉండాల్సి ఉంది. పైన చెప్పిన విభాగాలలో మూడు మరియు నాలుగవ ఏడాది చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఇతర దేశాలలో అండర్ గ్రాడ్యుయేట్ చేస్తున్న లేక చేసిన వారుకూడా దరఖాస్తు చేసుకోవచ్చు. గరిష్ట వయోపరిమితిపై నిబంధనలు లేవు.
ఈ పరీక్షలో కొత్తగా రెండు పేపర్లు చేర్చారు(నావెల్ ఆర్కిటెక్చరింగ్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, జియో మాటిక్స్ ఇంజనీరింగ్).  వీటిలో ఏదో ఒకదానికి అభ్యర్థులు హాజరవవచ్చు. రెండిటిని హాజరవడం గతేడాది నుండి అనుమతించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: