అమ్మాయిల కోసం స్పెషల్ స్కాలర్ షిప్స్.. ఎలా అప్లై చెయ్యాలంటే..?

Purushottham Vinay
అమ్మాయిలకు మంచి శుభవార్త. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న అమ్మాయిలకు ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్స్’ పేరిట యూజీసీ స్పెషల్ స్కాలర్ షిప్ అందించబోతుంది. బాలికల అక్షరాస్యతను పెంచేందుకు అలాగే ఉన్నత విద్యకు తోడ్పాటు అందించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఈ స్కాలర్‌షిప్‌ అండించడం జరుగుతుంది.దేశంలోని బాగా గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ లేక కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న సింగిల్ గర్ల్ చైల్డ్‌కు ఈ స్కాలర్‌షిప్‌ అందించడం జరుగుతుంది. ఇక నిర్దిష్ట ప్రమాణాల ప్రకారం 3000 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి యూజీసీ ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇందిరా గాంధీ స్కాలర్ షిప్స్’ అందించడం జరుగుతుంది.ఇక ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపికైన విద్యార్థినులకు సంవత్సరానికి రూ.36,200 చొప్పున స్టైపెండ్‌ అనేది అందించడం జరుగుతుంది. ఇక ఈ స్కీమ్ ద్వారా ప్రస్తుతం 3000 స్కాలర్ షిప్స్ అందించబోతున్నారు. ఒక్కొక్కరికీ కూడా సంవత్సరానికి రూ.36,200 చొప్పున రెండు సంవత్సరాలు మాత్రమే స్టైపెండ్‌ చెల్లించడం జరుగుతుంది.

పీజీ కాలేజీల్లో లేక యూనివర్సిటీల్లో మొదటి సంవత్సరంలో చేరబోయే విద్యార్థినులు ఈ స్కాలర్ షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.అయితే రెండవ సంవత్సరం చదువుతున్న వారికి అయితే ఈ స్కాలర్ షిప్ అనేది వర్తించదు. అలాగే అడ్మిషన్ సమాయం నాటికి సదరు అమ్మాయిల వయసు 30 సంవత్సరాల లోపు  మాత్రమే ఉంటేనే ఈ స్కాలర్ షిప్ అనేది వర్తిస్తుంది.ఇక రెగ్యులర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదవబోయే అమ్మాయిలకు అది కూడా తన తల్లిదండ్రులకు కేవలం ఒక సంతానమైన అమ్మాయిలకి మాత్రమే ఇది వర్తిస్తుంది. అన్న లేదా తమ్ముడు ఉన్న అమ్మాయిలకి కూడా ఇది వర్తించదు. అయితే కవల సోదరి లేదా సోదరుడు ఉన్న ఆడవారికి మాత్రం ఇది వర్తిస్తుంది. డిస్టెన్స్ మోడ్‌లో పీజీ చేసే వారు స్కాలర్‌షిప్‌కు మాత్రం ఎలాంటి అర్హులు కాదు.

అభ్యర్థులు ముందుగా నేషనల్ స్కాలర్ షిప్ పోర్టల్ (NSP) పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత నవంబర్ 30వ తేదీ లోపు దీనికి దరఖాస్తు చేసుకోవాలి.ఇక వారి ఆన్ లైన్ అప్లికేషన్‌ను సంబంధిత విద్యా సంస్థ పరిశీలన చేయాలి. తల్లిదండ్రులకు కేవలం తాను మాత్రమే ఏకైక సంతానమని చెప్పే అఫిడవిట్ ను కూడా దాఖలు చేయాలి. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత మరుసటి సంవత్సరం ఇదే పోర్టల్‌లో రెన్యువల్ చేసుకునే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది. ఇక సెమిస్టర్‌లో ఫెయిల్ అయిన వారికి మరుసటి సంవత్సరంలో స్కాలర్ షిప్ అనేది ఇక్కడ లభించదు.ఇక పూర్తి వివరాలకు ఇంకా దరఖాస్తు చేసుకోవడానికి సంబంధిత వెబ్‌సైట్‌లలో చూడొచ్చు.https://scholarships.gov.in/

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: