ఎల్లుండి నుంచి ఎంసెట్ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ లో 2021-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ ఉమ్మడి ప్రవేశ పరీక్షను ఈ ఏడాది కూడా కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీకి ఏపీ విద్యా శాఖ అప్పగించింది. ఏపీఈఏపీ సెట్ కు సంబంధించి జూన్ 25న  నోటిఫికేశన్ జారీ చేసిన ఏపీ విద్యా శాఖ. దరఖాస్తుల నమోదు ప్రక్రియ కూడా ఆన్ లైన్ విధానం ద్వారానే  జూన్ 26 నుంచి ప్రభుత్వం ప్రారంభించింది. పరీక్షలు కూడా పూర్తిగా ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజినీరింగ్ పరీక్షను ఎల్లుండి ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్నాయి. 5 రోజుల పాటు ఈ నెల 19, 20, 23, 24, 25 తేదీల్లో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష రాసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఇక అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలను ఒకే సారి నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. సెప్టెంబర్ 3, 6, 7 తేదీల్లో ప్రభుత్వం పరీక్షలు నిర్వహించనుంది.
కొవిడ్ నేపథ్యంలో విద్యార్థుల రక్షణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. మౌలిక సదుపాయల అందుబాటును దృష్టిలో పెట్టుకుని చర్యలు చేపట్టారు. ఈ పరీక్షలను మొత్తం 16 సెషన్లలో నిర్వహించేలా అధికారులు ప్లాన్ చేశారు. ఇందులో 10 సెషన్లలో ఇంజినీరింగ్, మిగిలిన ఆరు సెషన్లలో అగ్రికల్చర్, ఫార్మసీ అభ్యర్థులకు పరీక్షలు ఉండేలా ప్లాన్ చేశారు అధికారులు. కరోనా కారణంగా ఇప్పటికే ఇంటర్ పరీక్షలు రద్దు చేసిన ప్రభుత్వం... విద్యార్థులకు మాత్రం గ్రేడింగ్ విధానం అమలు చేసింది. ఇప్పుడు ఏపీ ఈఏపీ సెట్ మార్కుల ఆధారంగానే వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు వంద శాతం వెయిటేజీని తీసుకోవాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈఏపీ సెట్ -2021 పరీక్షకు మొత్తం 2 లక్షల 59 వేల 564 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఇంజినీరింగ్ కోసం 1,75,796 మంది అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోగా... 83,051 మంది అగ్రికల్చర్ పరీక్ష కోసం అప్లై చేశారు. 717 మంది మాత్రం ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాలు రెండూ కూడా రాసేందుకు సిద్ధమవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: