ఫీజు భూతం : రసీదుల చదువు? ఖరీదు కట్టు

RATNA KISHORE
రంగుల కాగితం
ఇంటికి వస్తే సంబరం


కాన్వెంటు నుంచి కార్పొరేటు
ఎదిగామా మనం? పతనం చెందామా?


ఎక్కడో ఓడిపోయి
బిడ్డలను మాత్రం గెలుపు కోసం
పరుగులు పెట్టించడంలో అర్థం అనర్థమా?


విలువలే ఆస్తి అని చెప్పేంత సన్నాఫ్ సత్యమూర్తులు ఇక్కడ లేరు. వీరికి మినహాయింపుగా కొంతలో కొంత తమ బాధ్యత నెరవే ర్చిన సంస్థలున్నాయి. అవి తమకు తోచిన రీతిన ఆదుకున్నా,ఫీజుల విషయమై అందరి బాటలో వెళ్లలేక అవస్థపడుతున్నాయి. ఇదే సమయంలో కొన్ని సంస్థలు విలువలు వదిలి ఇష్టారాజ్యంగా ప్రవర్తించి,ఫీజులు పిండేందుకు సిద్ధం అవుతున్నాయి. కొత్త ఏ డాదిలో (ఊహూ! కొత్త చదువుల ఏడాది అని రాయాలి..) ప్రారంభంలో యూనిఫాంలు,పుస్తకాలు ఇలా ఎన్నో కావాలి. వీటికితోడు పెరిగిన ధరలు ఓ అదనపు భారం. ఇదే సందర్భంలో ఫీజులు చెల్లింపు ఓ పెద్ద ఉత్పాతం! ఆర్థిక సంక్షోభాల రీత్యా ఎక్కడా ఎవ్వరికీ వెసులు బాటే లేని సమయంలో మళ్లీ  బడులు ప్రారంభమై కొత్త సమస్యలకు కారణం అవుతున్నాయి.  


ఈ సారి ర్యాంకుల పేరిట
రికార్డుల పేరిట
కార్పొరేట్ సంస్థల
అరుపుల్లేవు
కేకల్లేవు..ప్రకటనలూ లేవు
అయినా ఖర్చు తడిసిమోపెడు


చదువుకు ఫీజే భారం.పాపం రిక్షావోడి బిడ్డ చదువుకు పోగలదా? హా ! పోగలదు..కార్పొరేట్ చదువుకు అయితే పోలేదు! కానీ మామూలు బడికి పోగలదు. కానీ  మామూలు బడి అంటే అన్ని చోట్లా కాకపోయినా కొన్ని చోట్ల అయినా బాగా చెప్పరని సందే హం. అప్పుడు చదువు ఏమౌతుంది? వందల్లో మొదలయి లక్షల్లో చేరుతుంది. కరోనా పుణ్యమాని చదువు ఇంకాస్త ఖరీదు అ యింది. మన బడులకు తాళాలు వేయడంతో ఆన్లైన్ చదువులు మన జీవితాలనూ,స్టేటస్లనూ అన్నింటినీ మార్చేయి. అందరూ ఈ విధంగా చదవగలరా? చదివించగలరా?


బడి బ్యాగు బరువు 4 కేజీలు మించరాదు
ఎందుకు? అత్యున్నత కోర్టు అన్నీ చెప్పాలా?  


బడి..ఈ సారి ప్రయివేటు టీచర్లకు అన్నం దొరకనివ్వని బడి. ఆన్లైన్ క్లాసులు వచ్చాక కొద్దిమందికే బడి..కానీ ఫీజు అందరికీ కాదు అందరిదీ. దీంతో ఇదే అదునుగా కొన్ని యాజమాన్యాలు ఫీజులుం ప్రదర్శించిన దాఖలాలూ ఉన్నాయి. బడి ఉన్నా లేకపోయినా ఫీజులకు సంబంధించిన బడిత పూజ మాత్రం చేసేశాయి కొన్ని యాజమాన్యాలు. ఆన్లైన్ పుణ్యమాని పిల్లలకు అంతో ఇంతో చదు వు ఎక్కక పోయినా,పంతం పట్టి చదివించాలన్న తలంపుతో ఏదో ఒకటి చేసైనా చదివిద్దాం అన్న ఆలోచనతో కొందరు పూర్తి ఫీజుల చెల్లింపునకు మొగ్గు చూపారు. కొందరు మాత్రం మొండికేశారు. కొన్ని బడులు మాత్రం రీజనబుల్ గానే ఉన్నాయి కానీ వాటి సం ఖ్య చాలా తక్కువ. ఈ నేపథ్యంలో బడి ఫీజు సామాన్యుడి జేబుకు బరువుగా మారింది. ఇప్పటికిప్పుడు ఈ భారం తగ్గేలా లేదు కా నీ యాజమాన్యాలు కాస్త కనికరిస్తే ఇంకొందరి జీవితాలకో వెసులుబాటు దక్కే అవకాశం ఉంది.  


చదువు ఖరీదు ఎంత?
వందల నుంచి వేలు
వేలు నుంచి లక్షలు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: