TS ICET 2021 అభ్యర్థులకు డెడ్ లైన్.. ఈ ఒక్కరోజే అవకాశం..

Purushottham Vinay
తెలంగాణా స్టేట్ ఐసెట్ 2021 ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు డెడ్ లైన్ . అభ్యర్థులు ఎవరైనా అప్లికేషన్ ఫామ్ నింపే సమయంలో ఏమైనా తప్పులు చేసి ఉంటే వాటిని సరిదిద్దుకునే అవకాశాన్ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కల్పించడం జరిగింది. ఇక ఇందు కోసం ఏర్పాటు చేసిన అప్లికేషన్ కరెక్షన్ విండో ఈ రోజుతో ముగిసి పోనుంది. ఇక అభ్యర్థులు ఈ రోజు ఒక్క రోజు మాత్రమే తమ అప్లికేషన్లలో వున్న తప్పులను సరి చేసుకునే అవకాశం ఉందట.ఇక.. తెలంగాణ స్టేట్ ఐసెట్‌ 2021 ఎగ్జామ్‌ను ఆగస్టు 19 ఇంకా 20 తేదీల్లో రెండు షిఫ్ట్‌లలో నిర్వహించనున్నారు. మొదటి షిప్ట్ వచ్చేసి ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఉంటుంది..అలాగే రెండో షిఫ్ట్ వచ్చేసి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు నిర్వహించడం జరిగింది.

ఇక అభ్యర్థులు ఇలా కరెక్షన్‌ చేసుకోవచ్చు..

ముందుగా https://icet.tsche.ac.in/ ఓపెన్ చేయాలి.ఇక ఆ తర్వాత హోం పేజీలో 'Corrections for filled in application forms' అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది.ఇక వెంటనే ఆ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.ఇక ఇలా చేయడంతో మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

ఇక వెంటనే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, Payment Reference ID, Qualifying Examination Hall Ticket No, mobile Number, Date of Birth వివరాలను నమోదు చెయ్యాలి.తరువాత Get application బటన్ పై క్లిక్ చేయాలి.ఇక ఇప్పుడు మీ అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది.ఇక ఆ ఫామ్ లో మీకు అవసరమైన కరెక్షన్స్ అనేవి చేసుకోవాలి.తరువాత కరెక్షన్స్ చేయడం పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.

ఇక టీఎస్ ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా విడుదల చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికారులు ఈ షెడ్యూల్ ను ఖరారు చేయడం జరిగింది.

పాలిటెక్నిక్ అభ్యర్థులు ఇంజనీరింగ్ ఇంకా బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశాలకు నిర్వహించిన ఈసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు విడుదల చేయడం జరిగింది.

ఇక అభ్యర్థులు మొట్ట మొదటగా ఆగస్టు 24 నుంచి 28 వరకు కూడా ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: