జగన్‌.. ముందస్తా.. ముందుజాగ్రత్తా?

ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. జగన్ మూడేళ్ల పాలన ఇటీవలే పూర్తయింది. చివరి సంవత్సం ఎన్నికల సంవత్సరంగా అంతా భావిస్తారు. అయినా ఇంకా ఎన్నికల గురించి ఆలోచించేందుకు ఇంకా ఏడాదిన్నర సమయం ఉంది. కానీ.. ఇటీవల తరచూ సీఎం జగన్ ఎన్నికల కోణంలో ఆలోచిస్తున్నారు. పార్టీని సమాయత్తం చేస్తున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజల వద్దకు పంపారు. అక్కడి నుంచి వచ్చే ప్రతిస్పందనను రికార్డు చేస్తున్నారు.

అంతే కాకుండా.. సర్వేలు చేయిస్తున్నారు. తరచూ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే పార్టీ సీఎల్పీ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. మళ్లీ తాజాగా పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో నిన్న సీఎం  వైయస్‌ జగన్‌ భేటీ అయ్యారు.  పార్టీ సమన్వయ కర్తలు, జిల్లా పార్టీ అధ్యక్షులు క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. వారికి అప్పగించిన బాధ్యతలు పూర్తిస్థాయిలో నిర్వర్తించాలని పిలుు ఇచ్చారు.

మీ అందరిమీద నమ్మకంతో పార్టీ సమన్వయకర్తలుగా, జిల్లా అధ్యక్షులుగా బాధ్యత అప్పగించానన్న జగన్..  అందరూకూడా చిత్తశుద్ధితో, అంకిత భావంతో పనిచేయాలన్నారు. పార్టీ సమన్వయ కర్తలూ తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లి పర్యటనలు చేయాలని.. క్షేత్రస్థాయిలో పర్యటించి గడప గడపకు కార్యక్రమాన్ని సమీక్షించాలని ఆదేశించారు. జిల్లా అధ్యక్షులు, పార్టీ సమన్వయ కర్తలతో సమన్వయం,పర్యవేక్షణ చేస్తూ వెళ్లాలని... గడపగడపకూ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని పార్టీకి సూచించారు.

జగన్ ఇంతగా పార్టీపై ఎందుకు దృష్టి సారిస్తున్నారు.. ప్రతిపక్షాలు ఆరోపించినట్టుగా జగన్.. ముందస్తుకు వెళ్లే ఆలోచన చేస్తున్నారా అన్న చర్చ పార్టీతో పాటు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే.. ఇది ముందస్తు ఆలోచన కాదని.. పార్టీని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేసుకునే ముందు జాగ్రత్త మాత్రమేనని అని పార్టీలోని మరికొందరు నాయకులు భావిస్తున్నారు. ముందు జాగ్రత్తే అయితే మంచిదే.. అలాంటి సన్నద్ధత మేలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: