జగన్ ఆలోచన అదుర్స్.. మెచ్చుకున్న కేంద్రం?

ఏపీ సీఎం జగన్‌ కేంద్రంతో చేతులు కలుపుతున్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వ పథకంతో భాగస్వామ్యం కావాలని ఏపీ సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సూత్రప్రాయంగా ఓ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాష్ట్రం అమలు చేస్తోన్న  వైయస్సార్‌ ఉచిత పంటల బీమా పథకాన్ని.. మరింత మెరుగ్గా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్‌ బీమా యోజనతో భాగస్వామ్యం కావాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించారు.

కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహూజా, ఇతర అధికారుల బృందంతో ఆయన ఈ మేరకు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వ్యవసాయం, రైతు సంక్షేమ కార్యక్రమాల్లో ఏపీ మార్గదర్శకంగా నిలిచిందని కేంద్ర బృందం ప్రసంశించింది. ఆర్బీకేల వ్యవస్థను  కేంద్ర బృందం మెచ్చుకుంది.  కేంద్రంతో సమన్వయంతో ముందుకు సాగేందుకు ఈ విషయంలో  ప్రాథమికంగా ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు కారణంగా నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నామన్నారు. రైతులకు గరిష్ట ప్రయోజనాలు అందించేలా ఫసల్‌ బీమా యోజనలో చక్కటి మోడల్‌ను పొందు పరచాలని ముఖ్యమంత్రి కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు.

ఆశించిన మోడల్‌ను ఖరారు చేయగానే రాష్ట్రంలో కూడా అమలుకు కేంద్రంతో కలిసి భాగస్వామ్యం అవుతామని సీఎం జగన్ కేంద్ర బృందానికి తెలిపారు. ఈ అధికారులతో సీఎం జగన్ .. వ్యవసాయం, రైతు సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై కూడా చర్చించారు. ఏపీ పర్యటనకు వచ్చిన   కేంద్ర వ్యవసాయశాఖ కార్యదర్శి బృందం.. గన్నవరంలోని ఇంటిగ్రేటెడ్‌ కాల్‌ సెంటర్ ను సందర్శించింది. అక్కడ నుంచి వణుకూరులోని  రైతు భరోసా కేంద్రం, కంకిపాడులో ఇంటిగ్రేటెడ్‌ అగ్రిల్యాబ్‌ను కూడా సందర్శించింది.

అక్కడ తాము పరిశీలించిన విషయాలను..  తమ అనుభవాలను కేంద్ర బృందం  ముఖ్యమంత్రితో పంచుకుంది. అగ్రిల్యాబ్స్‌ ఏర్పాటు రైతులకు ఎంతో ప్రయోజనకరమన్న అహూజా.. అగ్రిల్యాబ్స్‌లో ముందస్తుగా నిర్వహిస్తున్న తనిఖీల్లో విత్తనాలు, ఎరువుల్లో కల్తీ ఉన్నట్టుగా నిర్ధారణ అయితే ఆ సమాచారాన్ని తమకు కూడా ఇవ్వాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: