జగన్‌: మళ్లీ పట్టాభి రెచ్చిపోతున్నారా?

టీడీపీ నేత పట్టాభి మరోసారి సీఎం జగన్‌ పై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన బోసడీకే వ్యాఖ్యలు రాజకీయ దుమారం లేపిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యల కారణంగానే ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఆయన్ను అరెస్టు కూడా చేశారు. అలాంటి పట్టాభి ఇప్పుడు మరోసారి ఘాటుగా మాట్లాడుతున్నారు.

అయ్యన్నపాత్రుడి ఇంటి గోడ కూల్చివేత ఘటనపై స్పందించిన పట్టాభి... చంద్రబాబుకు పెరుగుతోన్న ఆదరణ చూసి జగన్ సైకోలా మారుతున్నారని మండిపడ్డారు. జగన్ చరిత్ర.. జగన్ తాత చరిత్ర కబ్జాతోనే మొదలైందని.. జింకా వెంకట నరసయ్య అనే బీసీ వ్యక్తికి చెందిన గనులను కబ్జా చేయలేదా అని ప్రశ్నించారు. జింకా వెంకట నరసయ్యను జగన్ తాత రాజారెడ్డి హత్య చేసింది నిజం కాదా అని పట్టాభి ప్రశ్నించారు.

బీసీ వ్యక్తులను హత్యలు చేసి.. వారి శవాల మీద నడిచి రాజకీయం చేసిన చరిత్ర జగనుదని ఆరోపించిన పట్టాభి.. ఇడుపులపాయలో అసైన్డ్ భూములను కబ్జా చేసిన చరిత్ర వైఎస్ కుటుంబానిదేనన్నారు. ఇడుపులపాయలో అసైన్డ్ భూములున్నాయని వైఎస్ ఒప్పుకున్నది నిజం కాదా అని ప్రశ్నించిన పట్టాభి.. భూములు దానం చేసిన చరిత్ర అయ్యన్నదంటున్నారు. పేదలకు భూములిచ్చారని.. ఓ ఊరుకే అయ్యన్నపాలెం అనే పేరు పెట్టుకున్నారని.. పట్టాభి చెప్పుకొచ్చారు.

జగనుకు.. వైసీపీ నేతలకు సరైన మొగుడు నారా లోకేషే అంటున్న పట్టాభి.. బ్రేకుల్లేని బుల్డొజరులా తప్పు చేసిన జగనుతో సహా వైసీపీ నేతలను లోకేష్ తొక్కేస్తారు.. గుర్తుంచుకోండి అంటూ హెచ్చరిస్తున్నారు. న్యాయం కోసం దళిత టీచర్ వస్తే కనీసం ఆమెను చూడనైనా చూశావా అంటూ సీఎం జగన్ను పట్టాభి ప్రశ్నించారు. గతంలో ఘాటు వ్యాఖ్యల ద్వారా వివాదాస్పదమైన టీడీపీ నేత పట్టాభి కొంతకాలంగా సైలంట్‌ గానే ఉంటున్నారు. ఇటీవల మరోసారి తన నోటికి పని చెబుతున్నారు. మరి దీనికి వైసీపీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: