అయ్యన్నకు చుక్కలు చూపించాలని జగన్ డిసైడ్ అయ్యారా?

ఏదైనా అతి చేయకూడదని మన సామెతలు చెబుతుంటాయి. అతి సర్వత్ర వర్జయేత్ అంటుంటాయి. ఇప్పుడు టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి విషయంలో అదే జరుగుతుందేమో అన్నఅనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల అయ్యన్న పాత్రుడు చాలా పరుషంగా మాట్లాడుతున్నారు. రాజకీయాల్లో విమర్శలు చేయడం చాలా సహజం.. అందులోనూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో విమర్శలు చేస్తుంటారు.

అలా విమర్శించడాన్ని ఎవరూ తప్పుబట్టరు.. కానీ.. విమర్శలు లాజిక్‌ తో కాకుండా.. నోరు ఉంది కదా అని ఇష్టానుసారం బూతులు తిట్టేయడం.. రారా.. పోరా.. నా కొడక.. వంటి బూతు భాష వాడటం సరికాదు.. అయ్యన్న పాత్రుడు ఇటీవల తరచూ అదే పని చేస్తున్నారు. ఏకంగా సీఎంను పట్టుకుని శాడిస్టు నా కొడక.. దొంగ నా కొడక.. ఇలా ఇష్టానుసారం మాట్లాడుతూ వచ్చారు. తాజాగా చంద్రబాబు విశాఖ పర్యటనలో అయ్యన్నపాత్రుడు బూతులు పీక్స్ కు చేరాయి.

ఈ బూతులు పీక్స్ కు వెళ్లినందుకో ఏమో.. మొత్తానికి ఏపీ ప్రభుత్వం అయ్యన్నకు తన పవర్ ఏంటో చూపించాలని డిసై అయినట్టు కనిపిస్తోంది. తాజాగా మాజీ మంత్రి అయ్యన్న ఇంటిని పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా అయిన చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటిని ఈ తెల్లవారుజామున పోలీసులు చుట్టుముట్టారు. ఆయన ఇంటి గోడను అర్థరాత్రి మున్సిపల్ సిబ్బంది కూల్చారు. నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి గోడను జేసీబీలతో కూల్చేశారు.

ఎందుకని అడిగితే.. పంట కాల్వను ఆక్రమించి గోడ నిర్మించారని పురపాలక సిబ్బంది చెబుతున్నారు. ప్రభుత్వ భూమిలోని రెండు సెంట్లు ఆక్రమించారంటూ నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ అయ్యన్నకు ఇచ్చిన నోటీసులో తెలిపారు. ఈ నెల రెండో తారీకుతో ఉన్న నోటీసును ఇప్పుడు ఇస్తున్నారని అయ్యన్న కుటుంబసభ్యులు అంటున్నారు. అయ్యన్న పాత్రుడు ఇంటికి వెళ్లే రెండు మార్గాలను మూసివేశారు. మొత్తానికి అయ్యన్నకు తన పవర్ ఏంటో చూపాలని సీఎం జగన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: