మహేశ్‌బాబు మూవీ పేరుతో జగన్‌కు లోకేశ్‌ ప్రశ్న?

సర్కారు వారి పాట.. ఇటీవల మహేశ్ బాబు హీరోగా వచ్చిన సినిమా ఇది. ఆర్థిక అంశాలను స్పృశిస్తూ తీసిన సినిమా ఇది. ఇప్పుడు దీన్ని నారా లోకేశ్‌ రాజకీయాల్లోనూ వాడేసుకుంటున్నారు.  ఈ సినిమా పేరుతో జగన్‌ సర్కారును నారా లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్‌ వన్‌ పరీక్షల అక్రమాల్లో అంటే గ్రూప్‌1లో సర్కారు వారి పాట ఎంత అంటూ సోషల్ మీడియాలో నారా లోకేశ్ ప్రశ్నిస్తున్నారు. ఏ 1 నిర్వహ‌ణ‌లో గ్రూప్-1లో గూడుపు ఠాణీ జరిగిందని నారా లోకేశ్‌  ఆరోపించారు. గ్రూప్ వన్‌ పరీక్షల మూల్యాంకనంలో..  డిజిట‌ల్‌, మాన్యువ‌ల్ వాల్యుయేష‌న్‌లో భారీ తేడాలు జరిగాయని నారా లోకేశ్‌ ఆరోపించారు.

ఈ అక్రమాల కారణంగా  తెలుగు మీడియం అభ్యర్థులు అన్యాయ‌మయ్యారని నారా లోకేశ్‌ అంటున్నారు. స్పోర్ట్స్ కోటాలో కోత‌ల‌తో ఆశావ‌హులు ఆందోళనతో ఉన్నారని నారా లోకేశ్‌  తెలిపారు. డిజిట‌ల్‌, మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో 202 మంది అవుటయ్యారని  నారా లోకేశ్‌ పేర్కొన్నారు. అవ‌క‌త‌వ‌క‌ల‌పై గ‌వ‌ర్నర్ దృష్టిసారించి న్యాయ‌ విచార‌ణ జ‌ర‌పాలని నారా లోకేశ్‌ డిమాండ్ చేస్తున్నారు. గ్రూప్ 1 ఇంట‌ర్య్వూల ఎంపిక‌లో అక్రమాల‌ కారణంగా వంద‌లాది మంది ప్రతిభావంతుల‌కు తీర‌ని అన్యాయం జరిగిందని నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

జ‌గ‌న్‌ స‌ర్కారువారి పాట ఆట‌ క‌ట్టిస్తామంటున్న నారా లోకేశ్‌.. 30కి పైగా సీబీఐ, ఈడీ కేసుల్లో ఏ1 నిందితుడిగా వున్న సీఎం వైఎస్ జ‌గ‌న్‌ నిర్వహ‌ణ‌లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 కూడా అవ‌క‌త‌వ‌క‌లతోనే సాగిందని మండిపడ్డారు. డిజిట‌ల్ విధానంలో ఎంపికైన‌ 326 మందిలో 124 మంది మాత్రమే మాన్యువ‌ల్ వేల్యూయేష‌న్‌లో ఎంపిక కావ‌డం వెనుక మ‌త‌ల‌బేంటని నారా లోకేశ్‌ జగన్ సర్కారును  ప్రశ్నించారు.

డిజిట‌ల్‌లో మాయా జాలం జ‌రిగిందా... మాన్యువ‌ల్‌లో అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయా అనే విషయం ప్రభుత్వం తేల్చాలని నారా లోకేశ్‌ డిమాండ్ చేసారు. గతంలో ఎంపికై తాజా జాబితాలో 202 మంది పేర్లు గ‌ల్లంతు కావ‌డంపై ఏం స‌మాధానం చెబుతార‌ని నారా లోకేశ్‌ నిలదీస్తున్నారు. డిజిటల్ వేల్యూయేష‌న్‌లో 142 మంది తెలుగు మీడియం వాళ్లు ఎంపికైతే.. మాన్యువ‌ల్‌లో 47 మంది మాత్రమే సెలెక్ట్ కావ‌డం వెనుక ఏ జ‌గ‌న్ నాట‌కం న‌డిచిందని నారా లోకేశ్ మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: