వావ్.. ఆ విద్యార్థులకు జగన్ గుడ్ న్యూస్?
అలాగే.. ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక డిగ్రీ కాలేజీ ఉండాలని సీఎం అన్నారు. నియోజకవర్గంలో ఉన్న జూనియర్ కాలేజీని డిగ్రీకాలేజీ స్థాయికి తీసుకెళ్లాలని ఆదేశించారు. డిగ్రీ కాలేజీలను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక వ్యవస్థను తీసుకురావాలని జగన్ సూచించారు. డిగ్రీ విద్యాసంస్థల్లో గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో జీఈఆర్ గణనీయంగా పెరగాలని సీఎం జగన్ ఆదేశించారు.
గతంలో చదివించే స్తోమత లేక, చాలామంది అబ్బాయి చదువుకుంటే చాలు అనుకునేవారని.. అమ్మాయిలను పై చదువులకు పంపలేని పరిస్థితులు ఉండేవని జగన్ అన్నారు. ఇకపై అలాంటి పరిస్థితులను పూర్తిగా తీసేయడానికి ఇంట్లో ఉన్న పిల్లలు అందరికీ కూడా విద్యాదీవెన, వసతి దీవెన అందిస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. విద్యాదీవెన, వసతి దీవెన, అమలు వల్ల గతంలో కన్నా గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో పెరిగిందన్నారు.
దీంతో సంతృప్తి చెందకుండా మరింత గణనీయంగా 80 శాతనికి పెంచేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అన్నారు. రాష్ట్రంలో వెనుకబడ్డ ప్రాంతాల్లో అమ్మాయిలు చదువులకు దూరమవుతున్నారన్న సీఎం.. వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. వారిలో చైతన్యం తీసుకురావాలన్నారు. కర్నూలు పశ్చిమ ప్రాంతం, చిత్తూరు, ప్రకాశం జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం జగన్ కోరారు. దేశంలో డిగ్రీ చదవాలనుకుంటే ఏపీకి రావాలని అనుకునేట్టుగా ఉండాలని సీఎం జగన్ అన్నారు.ఏపీలో డిగ్రీలు చదివితే మంచి జీతాలు వచ్చే పరిస్థితి రావాలన్నారు.