చంద్ర‌బాబు వ్యూహానికి ఫ్యామిలీయే అడ్డొస్తోందా ?

VUYYURU SUBHASH
టీడీపీ అధినేత చంద్ర‌బాబు భారీ వ్యూహం సిద్ధం చేసుకున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచి తీరాల్సిన అవ‌స రం పార్టీ కంటే కూడా వ్య‌క్తిగ‌తంగా చంద్ర‌బాబుకు ఎక్కువ‌గా ఉంది. అసెంబ్లీలో చేసిన శ‌ప‌థం తీర్చుకోక పోతే.. జీవితాంత‌మే కాకుండా త‌ర్వాత కూడా శ‌ప‌థం నెర‌వేర్చుకోలేక పోయారు! అనే మాట చ‌రిత్రలో ఉండిపోతుంది. ఆయ‌న విజ‌న్ , ఫార్టీ ఇయ‌ర్స్ ఇండస్ట్రీ, హైద‌రాబాద్‌ను నిర్మించ‌డం.. ఇలా అనేక విష‌యాలు తెర‌మ‌రుగై.. ఒకే ఒక్క శ‌ప‌థం గురించే ఎక్కువ‌గా చ‌రిత్ర చెప్పుకొంటుంది. సో.. ఆయ‌న ఎట్టి ప‌రిస్థితిలోనూ గెలిచితీరాలి.
ఈ నేప‌థ్యంలోనే చంద్ర‌బాబు వ్యూహాల‌పై వ్యూహాలు వేస్తున్నారు. దీనిలో భాగంగా.. ఆయ‌న వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ అనుస‌రించిన ఫార్ములానే అనుస‌రిస్తార‌ని తెలుస్తోంది. ఇదే విష‌యం పార్టీలోనూ చ‌ర్చకు వ‌స్తోంది. దీనిని బ‌ట్టి క‌మ్మ‌సామాజిక వ‌ర్గానికి అనుకున్న విధంగా ప్రాధాన్యం త‌గ్గిస్తార‌ని.. అంటే.. ఎక్కువ టికెట్లు వారికి ఇచ్చే సంప్ర‌దాయాన్ని త‌గ్గించి వీరి స్థానాల్లో బీసీల‌కు లేదా.. ఇత‌ర సామాజిక వ‌ర్గాల‌కు కూడా కేటాయించి ప్ర‌జ‌ల్లోకి వెళ్తార‌ని తెలుస్తోంది.
ఇదే జ‌రిగితే.. స‌గానికి స‌గం సీట్లు క‌మ్మ వ‌ర్గానికి త‌గ్గిపోతాయి. అయితే.. ఇది ఒక‌రకంగా మంచిదే అయినా..తొలి చిక్కు చంద్ర‌బాబుకే ఎదుర‌వుతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎలాగంటే.. చంద్ర‌బాబు కుటుంబానికి మూడు టికెట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఒక‌టి త‌న‌కు, రెండో టికెట్ త‌న కుమారుడి, మూడో టికెట్ త‌న వియ్యంకుడు, న‌టుడు నంద‌మూరి బాల‌య్య‌కు కేటాయించాలి. ఇక బాల‌య్య రెండో అల్లుడు శ్రీ భ‌ర‌త్ కూడా లైన్లోనే ఉన్నాడు. ఇక నంద‌మూరి ఫ్యామిలీ నుంచే ఎవ‌రో ఒక‌రిని ఈ సారి గుడివాడ బ‌రిలో దింపాల‌ని చూస్తున్నారు.
మ‌రి క‌మ్మవ‌ర్గానికి టికెట్లు.. కేటాయింపు త‌గ్గిస్తాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. ముందు త‌న కుటుంబంలో త‌గ్గించుకోకుండా ఇత‌ర నేత‌ల‌పై ప‌డితే.. అది బ్యాడ్ ఇంపాక్ట్ ప‌డేలా చేస్తుంద‌ని అంటున్నారు.దీనిని బ‌ట్టి త‌న కుటుంబానికి టికెట్లు త‌గ్గించుకోక త‌ప్ప‌దు. అయితే.. ఇది సాధ్య‌మేనా.? అనేది ప్ర‌శ్న‌. ఇలా చేయ‌కుండా ఇత‌ర నేత‌ల‌కు ఎలా త‌గ్గిస్తారో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: