బిగ్‌డౌట్‌: జగనన్న.. రాజన్నను వదిలేశాడా..?

వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి..  జగన్.. దివంగత రాజశేఖర్ రెడ్డి కుమారుడు అన్న విషయం తెలిసిందే. జగన్‌కు కొండంత అండగా నిలిచేవారిలో ఈ దివంగత రాజశేఖర్‌ రెడ్డి అభిమానులు ఎక్కువ మంది ఉంటారు. జగన్ తొలిసారి సీఎం అయ్యాడంటే అందుకు ఉన్న ప్రధాన కారణం ఆయన వైఎస్‌ఆర్‌ కుమారుడు కావడమే. మిగిలిన అంశాలన్నీ తరువాత చెప్పుకునేవే. జగన్ కూడా తన తండ్రి పేరును వీలైనంత వరకూ చెప్పుకుంటూనే ఎదిగారు. ప్రతి సభలోనూ, సమావేశంలోనూ ఆ దివంగత నేత.. మన ప్రియతమ నాయకుడు.. అంటూ వైఎస్‌ గురించి చెబుతూనే ఉండేవారు.

అయితే.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్.. వైఎస్‌ పేరు స్మరణ మానలేదు. అయితే.. ఇటీవలి కాలంలో జగన్ తండ్రి స్మరణ తగ్గించి.. తన స్మరణే పెంచాడా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రత్యేకించి అనేక పథకాలకు పేర్లు పెట్టే విషయంలో ఈ అనుమానం తలెత్తుతోంది. గతంలో అనేక ప్రభుత్వాలు తమ పథకాల పేర్లకు అధికారంలో ఉన్న పార్టీ నాయకుల పేర్లు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు నెహ్రూ, ఇందిర, రాజీవ్‌ వంటి నేతల పేర్లు.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పేర్లు పథకాలకు పెట్టారు.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని పథకాలకు మొదట్లో తండ్రి పేరు పెట్టారు. కానీ.. ఆ తర్వాత ఏకంగా తనపేరే పెట్టుకోవడం ప్రారంభించారు. ఇక ఇప్పుడు ఏ పథకం పెట్టినా జగనన్న అని ముందు తన పేరు తగిలించడం ఎక్కువైంది. జగనన్న విద్యాకానుక, జగనన్న అమ్మఒడి, జగనన్న తోడు, జగనన్న విద్యాదీవెన.. జగనన్న ఆసరా, జగనన్న స్మార్ట్‌ కాలనీలు.. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి కార్యక్రమం కూడా జగనన్న అంటూ మొదలవుతోంది.

ఈ ట్రెండ్‌ చూస్తే.. ఇక రాష్ట్రంలో ప్రతి పథకానికీ జగన్ తన పేరే పెట్టుకుంటారా అన్న అనుమానం కలుగక మానదు. వీటిలో కొన్నింటికైనా తన తండ్రి పేరు పెట్టుకోవచ్చు..కానీ.. తండ్రి పేరు కంటే తనపేరే ఎక్కువగా పెట్టుకుంటున్నారు. ఈ పేర్లు చూస్తే.. జగనన్న రాజనన్నను వదిలేశాడా అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: