లవర్స్ డే: ఫిబ్రవరి 14.. ఆ 4 రాష్ట్రాల్లో ప్రేమ యుద్ధం..?

ఫిబ్రవరి 14 అంటే ముందుగా గుర్తొచ్చేది ప్రేమికుల రోజు.. ప్రపంచంలోని ప్రేమికులందరికీ ఇది ప్రత్యేకమైన రోజు.. ఆ రోజు తప్పకుండా తమ ప్రేమను వ్యక్తపరచాలని చాలా మంది ప్రేమికులు ఆ రోజు కోసం ఎదురుచూస్తుంటారు. అయితే.. ఈ ఫిబ్రవరి 14 మాత్రం ప్రత్యేకం.. ప్రత్యేకించి ఓ నాలుగు రాష్ట్రాల వారికి ఈ ఫిబ్రవరి 14 గుర్తుండిపోతుంది. అయితే.. అది ప్రేమ గురించి మాత్రం కాదు.. ఎందుకంటే.. ఆ రోజు నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి.

ఫిబ్రవరి 14న ఉత్తరప్రదేశ్‌, పంజాబ్, మణిపూర్, గోవా రాష్ట్రాల్లో ఎన్నికలు జరపాలని ఎన్నికల కమిషన్ నియమించింది. ఇందులో ఉత్తరప్రదేశ్‌లో ఫిబ్రవరి 14న ఒక దశలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 7 దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. కానీ.. మణిపూర్ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలైన పంజాబ్, మణిపూర్‌, గోవా రాష్ట్రాల్లో మాత్రం ఫిబ్రవరి 14న ఒకే దశలో రాష్ట్రం మొత్తం ఎన్నికల పోలింగ్ జరగబోతోంది.

అందుకే ఈ వచ్చే ఫిబ్రవరి 14 తేదీ.. పంజాబ్‌, మణిపూర్, గోవా రాష్ట్రాలకు చాలా ప్రత్యేకం. ఆరోజు ఎన్నికల సందర్భంగా ప్రేమ యుద్ధమే జరగవచ్చని సెటైర్లు పేలుతున్నాయి. ఈ ప్రేమికుల రోజును నాయకులు నిజంగానే ఓటర్లపై ప్రేమ కురిపించే రోజుగా మార్చుకోవాలని ప్రయత్నిస్తారు. ఫిబ్రవరి 14న ఓటరు తమపై ప్రేమ కురిపించేలా చేయాలని.. ఇప్పటి నుంచి ఆయా రాష్ట్రాల నాయకులు ఓటర్లను ఆకర్షించే పనిలో ఉంటారు.

ఇప్పటికే ఈ రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. అందుకే ఓటర్ల ప్రేమను పొందేందుకు ఈసారి నేతలకు ఎక్కువ సమయం కూడా లేదు. దీనికి తోడు కరోనా విజృంభణ దృష్ట్యా ఓటరు దేవుళ్లను ప్రసన్నం  చేసుకోవడం కూడా రాజకీయ నేతలకు అంత సులభమైన పని కూడా కాదు.  అందుకే ఇక ఆయా రాష్ట్రాల్లో నాయకులు డిజిటల్ జపం పాటించాల్సి ఉంటుంది. మొత్తానికి ఈ ఫిబ్రవరి 14 ప్రేమికుల సంగతేమో కానీ.. ఆ నాలుగు రాష్ట్రాల్లోని రాజకీయ నాయకులకు మాత్రం ప్రేమ యుద్ధం మిగులుస్తుంది. మరి ఈ యుద్ధంలో నెగ్గేవాళ్లెవరో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: